page contents

చిరంజీవి 152వ సినిమాలో తమన్నా?

‘సైరా’ హిట్ తో ఫుల్ బీజీగా మారిన తమన్నా

తమన్నా అంటే ఓన్లీ గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకుంటున్న తరుణంలో తనలోని అద్భుతమైన నటనను సైరా మూవీలో చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. మంచి క్యారెక్టర్ వెతుక్కుంటూ రావాలేగానీ తన ఫర్మామెన్స్ కు కొదవలేదని మిల్కి బ్యూటీ చాటిచెప్పింది. తనలొ కేవలం గ్లామర్ మాత్రమే కాదు..  అద్బుతమైన నటి ఉందని  సైరా మూవీ ద్వారా చాటిచెప్పింది మిల్కీ బ్యూటీ.

chiranjeevi, tammannaసైరా మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్  అయింది. ఈ సినిమాలో చిరంజీవి తర్వాత అంతటి పేరు తమన్నాకు రావడంతో ఆమెను మళ్లీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సైరా మూవీ విడుదల సమయంలో తమన్నా సైరా కోసం విపరీతంగా ప్రచారం చేసింది. తోటి హీరోయిన్ నయనతార సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కన్పించకపోయినా తమన్నా మాత్రం తనవంతు సహకారం చిత్ర యూనిట్ కు అందించింది. సైరాలో చిరంజీవి ప్రియురాలు ‘లక్ష్మీ’ పాత్రలో ఓదిగిపోయింది. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకే పరిమితమైన తమన్నా ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తుండటంతో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలవైపు మొగ్గు చూపిందని సమాచారం. అయితే చిరంజీవి తదుపరి మూవీలో కూడా మిల్కీ బ్యూటీ నటించనుందనే వార్త ఫిల్మీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవితో వన్స్ మోర్ అంటున్న తమన్నా..

chiranjeevi with tamanna

తన స్నేహితుడు, నిర్మాత అయిన రాంచరణ్ నిర్మించిన సినిమా కోసం ఎప్పుడు కోరినా కాదనకుండా ప్రచారంలో పాలుపంచుకొంది తమన్నా. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు కోసం రాంచరణ్ ఎంత కష్టపడ్డాడో అంతకంతకు తమన్నా కూడా ఈ సినిమా కోసం కష్టపడి ప్రచారం చేసింది.  ఇక చిరంజీవి 152 సినిమా కొరటాల దర్శకత్వంలో ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోని సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా ఒక హీరోయిన్ గా తమన్నాను తీసుకునే ఆలోచనలో నిర్మాత రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లు సమాచారం. సైరాలో మిల్కీ బ్యూటీ నటనకు మెగాస్టార్ ఫిదా అయ్యాడు. దీంతో తన తదుపరి చిత్రంలో కూడా తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నాడటా. అన్ని అనుకూలిస్తే చిరంజీవి 152వ మూవీలో తమన్నా మరోసారి చిరంజీవికి జోడిగా మరోసారి నటించడం ఖాయంగా కన్పిస్తుంది.

మరిన్ని తమన్నా ఫొటోలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *