page contents

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’

దేశ రాజధాని ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం(ఆగస్టు 9)న ప్రకటించారు. 2018లో వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేస్తారు. మహానటి జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వర్గీయ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కింది. కీర్తీ సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫీదా అయి మహానటికి బ్రహ్మండమైన విజయం అందించారు.

mahanati kirthi suresh

ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తీ సురేష్ నటించారనే దానికంటే జీవించారని చెప్పొచ్చు. కీర్తీ సురేష్ అలనాటి సావిత్రిని ఈ తరానికి, పాతతరం వారికి తన అద్భుత నటనతో గుర్తుచేసింది. ఎలాంటి స్టార్ హంగామా లేకుండా కీర్తీ సురేష్ అద్భుత నటన, నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభపైనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి అపూర్వ విజయం సాధించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం మహానటి ఎంపికైంది. అలాగే జాతీయ ఉత్తమ నటిగా కీర్తీ సురేష్(మహానటి), జాతీయ ఉత్తమ కాస్ట్యుమ్ డిజైనర్(మహానటి) అవార్డులను గెలుచుకొని తెలుగు సినిమా సత్తాను జాతీయ స్థాయిలో చాటింది. మహానటితోపాటు రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్రాలు అవార్డులును దక్కించుకున్నాయి.

జాతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు:

ఉత్తమ చిత్రం : హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు : ఆదిత్య ధర్(ఉరి)
ఉత్తమ నటుడు : ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
ఉత్తమ నటి : కీర్తి సురేష్(మహానటి)
ఉత్తమ సహాయ నటుడు : స్వానంద్ కిర్కిరే(చంకక్)
ఉత్తమ సహాయ నటి : సురేఖా సిక్రీ(బదాయ్ హో)
ఉత్తమ పర్యావరణ్ పరిరక్షణ నేపథ్య చిత్రం : పానీ(మరాఠీ)
ఉత్తమ సామాజిక చిత్రం : ప్యాడ్ మ్యాన్
ఉత్తమ వినోదాత్మక చిత్రం : బదాయ్ హో
ఉత్తమ పరిచయ దర్శకుడు : సుధాకర్ రెడ్డి యాకంటి(నాల్ : మరాఠీ)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం : అంధాధున్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం : మహానటి
జాతీచ ఉత్తమ సినిమాటోగ్రఫీ : పద్మావత్
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం : హమీద్
ఉత్తమ సంగీత దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
జాతీయ ఉత్తమ యాక్షన్ చిత్రం : కేజీఎఫ్
ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం(రాజా కృష్ణన్)

rangastalam

ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం : చి.ల.సౌ
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ : అ!(తెలుగు), కేజీఎఫ్(కన్నడ)
ఉత్తమ సాహిత్యం : నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్ : అ!
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కమ్మార సంభవం(మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్ : నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్ : ఉరి
ఉత్మ అడాప్టెడ్ స్ర్కీన్ ప్లే : అంధాధున్
ఉత్తమ సంభాషణలు : తారీఖ్(బెంగాలీ)
ఉత్తమ గాయని : బిందుమాలిని(నాతి చరామి: మాయామి మానవే)
ఉత్తమ గాయకుడు : అర్జిత్ సింగ్(పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలామ్ అర్హద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
నర్గీస్ దత్ అవార్డు : వండల్లా ఎరడల్లా(కన్నడ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *