page contents

వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శికి ‘దాస్యం’ పరామర్శ

వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శికి ‘దాస్యం’ పరామర్శ

వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో జనగామ డెస్క్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు కాలుకు తీవ్రంగా గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం ఆయన ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.

దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్

ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వీరగంటి రవీందర్, రంజిత్ రావు, విద్యాసాగర్, శ్రీనివాస్, కూడా డైరెక్టర్ ఐలయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *