page contents

హుజూర్ నగర్ తీర్పు దెనికీ సంకేతం

కారు జోరు.. కాంగ్రెస్ డీలా

హుజూర్ నగర్ లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. తొలిసారి హుజూర్ నగర్లో టీఆర్ఎస్ ఖాతా తెరిచింది. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కారు జోరు చూపించగా కాంగ్రెస్ వెనుంజను కనబర్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి రౌండ్ రౌండ్ కి అధిక్యం ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఏ రౌండ్లోనూ అధిక్యాన్ని ప్రదర్శించలేదు. గురువారం 12గంటల వరకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 23వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ముందజను కనబరుస్తున్నారు.

కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన కేసీఆర్..

Huzeer nagar assembly election result

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హుజూర్ నగర్లో టీఆర్ఎస్ జెండా ఎగురలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ సీటు ఇక గులాబీ రంగును పులుముకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ స్థానం కాంగ్రెస్ కు గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. అలాగే రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆర్టీసీ సమ్మె వంటి విషయాలు కాంగ్రెస్ గెలుపుకు కలిసొస్తాయని అందరూ అంచనా వేశారు. అయితే ఈ ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తన రాజకీయ చతురతను మరోసారి చాటారు.

హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికల మెనిఫెస్టోను ప్రకటించాలనుకున్నా రు. అయితే కేసీఆర్ బహిరంగ సభ రోజు భారీ వర్షం రావడంతో సభను రద్దు చేసుకున్నాయి. కేసీఆర్ హుజూర్ నగర్ కు వెళ్లకపోయినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పు ప్రజా రెఫరెండంగా తీసుకోవాలని తొలి నుంచి ప్రచారం కాంగ్రెస్ ఓటమి దిశగా వెళ్లడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడి వదిలిన ఎమ్మెల్యే సీటునే కాంగ్రెస్ కాపాడుకోలేకపోవడంపై కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందన్న వారికి టీఆర్ఎస్ గెలుపు చెంప పెట్టులా మారింది. ఈ ఎన్నికలో విజయం మాత్రం అంతా తానై నడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి దక్కనుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి ఈ గెలుపు కిక్కు ఇవ్వనుండగా కాంగ్రెస్ కి మాత్రం చేదు గుళికలా మారనుంది. ఏదిఏమైనా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఎదురులెదని మరోసారి నిరూపించుకొని గులాబీ జెండాను రెపరెపలాడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *