page contents

Arjun Suravaram Pre Release Celebration

ఆమె సొట్టబుగ్గలకు మెగాస్టార్ ఫిదా

ఆమె సొట్టబుగ్గల అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. ఈ విషయాన్నే మెగాస్టార్ చిరంజీవి ఆ హీరోయిన్ ఎదుటే నిర్మోహటంగా చెప్పేశారు. తన నవ్వంటే ఇష్టమని, ముఖ్యంగా తన సొట్టబుగ్గలంటే మరీ ఇష్టమంటూ ఆ హీరోయిన్ కి కితాబిచ్చారు మెగాస్టార్.

arjun suravaram pre release

నిఖిల్ సిద్దార్థ హీరోగా నటించిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంగళవారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనను ప్రేమించే నిఖిల్ లాంటి అనుచరగణం పెరగడంతో తన బ్యాంకు బాలెన్స్ మరింత పెరిగిందన్నారు. వాయిదాలు పడుతూ వస్తున్న అర్జున్ సురవరం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. జర్నలిజం బ్యాక్ డ్రాప్, మంచి కంటెన్ట్ తో వస్తున్న ఈ సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని అభిమానులను కోరారు.

ఇందులో భాగంగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మెగాస్టార్ ఆసక్తికర కామెంట్ చేశారు. లావణ్య త్రిపాఠి నవ్వంటే తనకు ఇష్టమని, మరీ ముఖ్యంగా తన బుగ్గలపై పడే సొట్ట అంటే ఇష్టమంటూ తన మనస్సులో మాటను వెలిబుచ్చారు. అక్కడే ఉన్న లావణ్య ఆ మాటలకు ముసిముసిగా నవ్వడంతో ఆమె బుగ్గలు సొట్టబడ్డాయి. దీంతో మెగాస్టార్ హ్యపీ అయ్యారు. ఈ సినిమాకు ఆమె గ్లామర్ ప్రధాన ఆకర్షణ కానుందని తెలిపారు. అర్జున్ సురవరం గత కొంతకాలంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జున్ సురవరం సినిమాకు మెగా సపర్ట్ లభించడంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై చిత్రబృందం దృష్టిసారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *