page contents

Aura .. Looks like Saira ..

ఔరా.. అనిపిస్తున్న సైరా..

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టు సైరా నర్సింహారెడ్డి మూవీ విడుదలకు ముందే ఔరా అనిపిస్తోంది. సైరా విడుదల తేది రోజుల్లోని గంటల్లోకి మారడంతో సైరా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సైరా చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఓ తెలుగు మూవీ ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలవడం సైరాతోనే సాధ్యమైంది. సైరా ఏకకాలంలో తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి.

sye-raa-narasimha-reddy

విడుదలకు ముందే రికార్డులు..

సుమారు 300కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన సైరా సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 108కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా విదేశాల్లో తెలుగు రైట్స్ కలిపినట్లయితే 150కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. కన్నడలో 27కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక తమిళం, మళయాళ, హిందీ భాషల్లో కూడా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. సైరా గురువు క్యారెక్టర్లో అమితాబచ్చన్ నటిస్తుండటంతో హిందీతో భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. చైన్నెలో సైరా మూవీ మొదటి రోజు 50 స్పెషల్ షోలు వేయనున్నారు. ఉదయం 8గంటలకే ఈ షోలు ప్రారంభమవడం విశేషం. సాహో మూవీ 30షోలు వేయగా సైరాకు 50షోలకు అనుమతి లభించడం విశేషం.

సైరా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య..

ప్రపంచ వ్యాప్తంగా సైరా నర్సింహారెడ్డి చిత్రం 4620కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలకానుంది. తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే నైజాంలో 420, సీడెడ్ 330, ఆంధ్ర 450 థియేటర్లలో మొత్తంగా చూసినట్లయితే 1200 థియేటర్లలో సైరా మూవీ విడుదవుతోంది. ఇక కర్ణాటకలో 340, తమిళనాడులో 350, కేరళలో 130, హిందీ, ఓవర్సీస్ కలిపి 1600 థియేటర్లలో సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలవుతూ భారీ అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే సినిమాకు సెన్సార్ నుంచి సింగిల్ కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సైరా టీజర్, ట్రైలర్, సైరా టైటిల్ సాంగ్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచిన సైరా మరీ కొన్నిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *