page contents

Helo friends .. Are you following these instructions?

హలో మిత్రులారా.. ఇవి పాటిస్తున్నారా?

ఆన్ లైన్లో సురక్షితంగా ఉండటం ఎలాగో చెబుతున్న హెలో!

ప్రతి మనిషి దైనందిన జీవితంలో సోషల్ మీడియా అనేది నిత్యకృత్యంగా మారింది. సోషల్ మీడియాకు అలవాటు పడిన తర్వాత అది లేకుండా ఒక్క క్షణం గడపడమంటే ఒక యుగంలా ఫీలయ్యే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదామో. సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియా దుర్వినియోగమైతే మన బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు మాయమై పోవడంతోపాటు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమై నానారకాల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది మన హెలో(Helo).

హలో ఈ విషయాలు పాటించండి..

సోషల్ మీడియాను పట్ల ఓ కొంచెం అవగాహన ఉన్నా సరే హెలో యాప్ గురించి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో సుప్రసిద్ధ ప్లాట్ ఫామ్ హలో. ఈ యాప్ ద్వారా యూజర్లు చాలా విషయాలను తమ స్నేహితులు, ఫాలోవర్స్ తో పంచుకుంటుంటారు. అలాగే హలో కూడా తమ యూజర్లు సోషల్ మీడియాను ఏవిధంగా ఉపయోగించుకునే విషయంలో కొన్ని సలహాలు, పద్ధతులను అందిస్తోంది.

1) మీ స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ లాక్ చేయడం చాలా అవసరం. మనం ప్రతీ చిన్నపని కూడా స్మార్ట్ ఫోన్ వాడడం అలవాటే. అది ఇతరులకు కాల్ చేయడం, సోషల్ మీడియాలోని యాప్స్ ద్వారా చెల్లింపులు చేయడం లాంటి కావచ్చు. ఇలా చేసేటప్పుడు మీ వ్యక్తిగత రహస్య సమాచారం వేరే వాళ్లకు చేరి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలంటుంది హలో.

2) స్క్రీన్ లాక్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే.. మీ ఫోన్ హ్యాక్ చేయడానికి వీల్లేకుండా అతి క్లిష్టమైన, వినూత్నమైన, బలమైన పాస్ వర్డ్ పెట్టుకోవడం. సోషల్ మీడియా ప్రొఫైల్స్ కోసం బలమైన పాస్ వర్డ్ ను ఎంచుకోవడమనేది ఆన్ లైన్ భద్రతకు భరోసా కల్పిస్తుంది. సంఖ్యలు, అక్షరాలు, గుర్తులు/ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సమ్మేళనంగా పాస్ వర్డ్ ఎంచుకోవడం అత్యుత్తమ పద్ధతి అని చెబుతోంది హలో. అలాగే మీ పాస్ వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు. దీనివల్ల మీ ఖాతా దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.

3) గరిష్ట భద్రత పొందేందుకు మరో మార్గాన్ని కూడా హలో సూచిస్తుంది. అదేటంటే.. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ను ప్రైవేట్ గా ఉంచడం. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై డాటా లీక్ ప్రమాదం జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉండటంతోపాటు అభ్యంతరకరమైన అంశాలు, ఇతర అంశాలు కూడా బహిర్గతమయ్యే అవకాశాలుంటాయి. మీ ప్రొఫైల్ సమాచారం పొందిందేకు థర్డ్ పార్టీ యాప్స్ అనుమతించే ముందు మీ ప్రొఫైల్ సురక్షితంగా ఉంచుకోవడం అవసరం. అలాగే వ్యక్తిగత సమాచారం అయినటువంటి ఫోన్ నెంబర్లు, ఫొటోగ్రాఫ్ లు, ఇతర అంశాలను యాప్స్ పై సహచర వినియోగదారులతో పంచుకోవడాన్ని నిరోధించాలి.

hello instructions

4) ఇదే రీతిలో స్నేహితులను అనుసరించడం, ధృవీకరించని ఖాతాలను అనుసరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది హలో. సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన కమ్యూనిటీ కనెక్ట్ లక్ష్యమైనప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ధృవీకరించిన ఖాతాలను మాత్రమే అనుసరించడం సూచనీయం మరియు ప్రొఫెల్ కు దిగువన టిక్-మార్క్ ఉన్న యూజర్లు, యాప్ చేత ధృవీకరించబడిన ఖాతాగా పరిగణించడంతోపాటుగా అనుసరించేందుకు సురక్షితమని గమనించండి. వినియోగదారులకు ధృవీకరించిన సమాచారం అందించే ప్రయత్నంలో, హెలో ఇప్పుడు పలు మీడియా భాగస్వాములతో చేతులు కలిపింది. తమకు అందించిన సమాచారం నమ్మకమైనదని, విశ్వసనీయవర్గాల నుంచి తమకు అది లభించిందనే భరోసా కల్పిస్తున్నాయి.

5) మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవడం ఎంతమాత్రం సూచనీయం కాదు. మనం స్నేహితులను పెంచుకోవడానికి సోషల్ మీడియా వేదిక కావచ్చు కానీ, మన వ్యక్తిగత సమాచారం అయినటువంటి పుట్టిన రోజు, వయస్సు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఫొటోగ్రాఫ్స్ వంటివి ఇతరులు దొంగిలించేందుకు అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని మోసగాళ్లు, సైబర్ కేటుగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగతమని భావించిన ఏ సమాచారం కూడా మీరు నమ్మనటువంటి వ్యక్తులెవరితోనూ పంచుకోవద్దని హలో మరీమరీ చెబుతుంది.

6) ఇక చివరగా మీరు సైనప్ చేసే ముందు, కమ్యూనిటీ మార్గదర్శకాలను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. మొదటిసారి వినియోగదారులు తమను తాము సృజనాత్మకంగా వ్యక్తీకరించుకునేందుకు, కంటెంట్ ను ప్రోత్సహించేందుకు హలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ యాప్ ప్రస్తుతం 14 భారతీయ భాషల్లో లభ్యమవుతుంది. చట్ట వ్యతిరేకమైన లేదా అత్యంత కఠినమైన కమ్యూనిటీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ఏది కూడా హలో ప్రోత్సహించదు. ఈ మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవడంతోపాటుగా వాటిని అర్థం చేసుకొని ఏది పోస్టు చేయాలి, ఏది పోస్టు చేయకూడదో తెలుసుకోవాలి. తద్వారా అది మీతోపాటు ఇతరులను కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఎంతైనా సోషల్ మీడియా ముఖ్యోద్దేశం ప్రజలను అనుసంధానించడం. వారి అభిప్రాయాలకు గొంతుకనివ్వడం.. మరియు సురక్షితమైన, భద్రమైన వెబ్ వాతావరణంలో వినోదాన్ని పంచడమే. ఏదిఏమైనా సోషల్ మీడియా వాడేటప్పుడు పై అంశాలను పాటిస్తూ వినోదంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని హలో(Helo) కోరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *