page contents

How can the Triple Talak Bill pass without numerical strength in Rajya Sabha?

రాజ్యసభలో సంఖ్యా బలం లేకుండా త్రిపుల్ తలాక్ బిల్లు ఎలా పాసైంది?

 

Stop divorce

రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు పాస్ చేసింది. అయితే రాజ్యసభలో తగినంత సంఖ్యా బలంలేని బీజేపీ రాజ్యసభలో ఎలా నెగ్గించుకోగలిగిందనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లు విగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా బీజేపీ తన పంతం నెగ్గించుకోవాలని పక్బడ్బంధీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

నరేంద్రమోడీ మొదటిసారిగా 2017లోనే త్రిపుల్ తలాక్ పై బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి నెగ్గించుకుంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని భావించినా నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, తదితర పార్టీలు రాజ్యసభలో అడ్డుకోవడంతో నాడు రాజ్యసభలో బిల్లు వీగిపోయింది. కాగా రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి మళ్లీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈసారి కూడా నాటి పరిస్థితులే ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును రాజ్యసభలో గట్టేక్కించేసింది.

Muslim women celebrations
99 అనుకూలం, 84వ్యతిరేకం..

త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో 99మంది సభ్యులు అనుకూలంగా ఓటువేయగా 84మంది వ్యతిరేకించారు. 114మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి అన్నాడీఎంకే, ఆరుగురు జనతాదళ్ సభ్యులు వ్యతిరేకించి బయటికి వెళ్లిపోయారు. మరికొందరు సభకు హాజరుకాకపోవడంతో బీజేపీ బలం 92కు పడిపోయింది. చివరి నిమిషంలో ఏడుగురు బీజుదళ్ సభ్యులు బిల్లుకు మద్దుతు ఇవ్వడంతో 99మంది సభ్యులు అనుకూలంగా, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో బిల్లు పాసైంది.

ఈ బిల్లుకు అనుకూలంగా బీజేపీ, శివసేన, బీజేడీ, అకాళీదళ్ నిలువగా వ్యతిరేకంగా కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, వైఎస్సాసీపీ, తటస్థంగా అన్నాడీఎంకే, జేడీయూ, టీఆర్ఎస్, టీడీపీ వ్యవహరించారు. దీంతో ఎట్టకేలకు బీజేపీ రెండో సారి రాజ్యసభలో ప్రవేశపెట్టి త్రిపుల్ తలాక్ బిల్లును నెగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *