page contents

How much is The Lion King India Target?

‘ది ల‌య‌న్ కింగ్’ ఇండియా టార్గెట్ ఎంత‌?

ఈనెల 19న ‘ది ల‌య‌న్ కింగ్’ మూవీ ఇండియాలో విడుద‌ల‌వుతోంది. ఇండియాలోని ప‌లు భాష‌ల్లో ది ల‌య‌న్ కింగ్ సినిమాను డిస్నీ సంస్థ విడుద‌ల చేయ‌నుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రీలిజ్ చేసేందుకు ఆయా ప్రాంతీయ భాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టుల‌తో డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు.  రెండు గంట‌ల నిడివితో యానిమేటేడ్ 3డీ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ది ల‌య‌న్ కింగ్ సినిమా ఇండియా టార్గెట్ అక్ష‌రాల 500కోట్లు. ఇండియాలో 500కోట్లు కొల్ల‌గొట్టేందుకు ది ల‌య‌న్ కింగ్ దండ‌యాత్ర రేప‌టి నుంచి ప్రారంభించ‌నుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే డిస్నీ సంస్థ ప్ర‌మోష‌న్ల‌ను భారీగా చేస్తోంది.

the lion king

ఇప్ప‌టికే మ‌న‌కంటే ముందుగా చైనాలో ది ల‌య‌న్ కింగ్ రిలీజ‌యింది. చైనాలోని థియ‌ట‌ర్ల‌లో వ‌సూళ్ల ప్రభంజ‌నం సృష్టిస్తుంది. కేవ‌ల మూడు రోజుల్లోనే 54 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. ఇది ఇండియ‌న్ క‌రెన్సీలో 372 కోట్లు. చైనాలో మంచి ఆద‌ర‌ణ పొందుతున్న ఈ చిత్రం మ‌రిన్ని క‌లెక్ష‌న్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కన్పిస్తోంది.

2016లో డిస్నీ సంస్థ నుంచి వ‌చ్చిన ‘ది జంగిల్ బుక్’ రికార్డుల‌ను ‘ది ల‌య‌న్ కింగ్’ అధిగ‌మించేలా ఉంది. చైనాలో ది జంగిల్ బుక్ రికార్డుల‌ను ది ల‌య‌న్ కింగ్ తిర‌గ‌రాస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇండియాలోనూ ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. ఇండియాతోపాటు ఈనెల 19న ఉత్త‌ర అమెరికాలోనూ ది ల‌య‌న్ కింగ్ విడుద‌ల చేస్తోంది. కేవ‌లం ఇండియాలోనే 500కోట్లు కొల్ల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే అమెరికా నుంచి 200 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను టార్గెట్ గా పెట్టుకొంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ క‌లిసి చూడ‌గ‌లిగే చిత్రం కావ‌డంతో ఈ సినిమాకు ఆద‌ర‌ణ పెర‌గ‌డం ఖాయంగా క‌న్పిస్తోంది. డిస్నీ సంస్థ విడుదల చేసిన సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కథ కూడాా  భారతీయులకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో భారీ వసూళ్లు సాధించేలా కనిస్తోంది. అయితే డిస్నీసంస్థ అంచ‌నాల ప్ర‌కారం ఇండియాలో రూ.500కోట్లు సాధిస్తుందా? లేక అంతకంటే ఎక్కువ సాధిస్తుందో చూడాలి. రేపటి నుంచి ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన రికార్డులపై చర్చ మొదలుకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *