page contents

I met the real megastar: Ramcharan

రియల్ మెగాస్టార్ ని కలిశా: రాంచరణ్

రాంచరణ్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన ఒక ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. సైరా సినిమా షూటింగ్ సమయంలో రాంచరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి పని చేసిన ఓ ఫొటోను చెర్రీ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

తాను నిర్మాతగా మారడం వల్లనే తనకు రియల్ మెగాస్టార్ ని కలిసే అవకాశం వచ్చిందన్నారు. తన తండ్రి నటించే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం, కలిసి పని చేయడం వల్ల నిజమైన మెగాస్టార్ ను దగ్గరి నుంచి చూసే అవకాశం వచ్చిందన్నారు. మెగాస్టార్ సినిమాలను ఎలా ప్రేమిస్తారో.., నిర్మాత, దర్శకుడు, తోటి నటీనటులతో ఏవిధంగా ప్రవర్తిస్తారో చూసే అవకాశం తాను నిర్మాతగా మారడం వల్లే లభించదని, తన తండ్రిని చూసి చాలా నేర్చుకున్నట్లు రాంచరణ్ పోస్టు చేశారు. తాను నిర్మిస్తున్న సైరా మూవీ కోసం చిరంజీవి మారిన తీరు తనకు మార్గనిర్దేశం చేసిందని పేర్కొన్నారు.

ramcharan with mega star (image source Instagram)

ఈ ఫొటోలో చెర్రీ తన తండ్రి గడ్డం పట్టుకొని కనిపిస్తాడు. సైరా చిరంజీవి లుక్ అదిరిపోయేలా ఉంది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా చిరంజీవి మారిన తీరును చూస్తూ కనిపించాడు చెర్రీ. ఈ ఫొటోలో చిరంజీవిలోని తెలియని మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్ర చిరంజీవి కోసమే పుట్టిందా అన్న రీతిలో మెగాస్టార్ లుక్ కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రాంచరణ్ ఇప్పటికే ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఈనెల 15న రాయలసీమలోని కర్నూలులో సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సైరా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెల్సిందే. టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ద్వారా తెలుగు మార్కెట్ పై దృష్టిసారించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజవుతున్న సైరా సినిమాకు భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. కర్నూలులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా అమితాబచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్ రానున్నారని సమాచారం. అక్టోబర్ 2(గాంధీ జయంతి)న చిత్రం విడుదల చేసేందుకు రాంచరణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా రాంచరణ్ సోషల్ మీడియాలో సైరాకు సంబంధించి ఫొటోలను పోస్టు చేస్తుండటం అభిమానులకు ఉత్సాహా పరుస్తుంది. దీనిని అభిమానులు ఇతరులకు పోస్టు చేస్తుండటంతో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *