page contents

Ileana paired with Chiranjeevi

చిరుతో ఆటకు సై అంటున్న గోవా సుందరీ!

ఇటీవలే చిరంజీవి 151వ చిత్రం సైరా నర్సింహారెడ్డి షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. సైరా మూవీ సెట్స్ పై ఉండగానే చిరంజీవి తదుపరి చిత్రం కోరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించారు. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్లలో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభం కాకముందే నుంచి సినిమా స్టోరీపై రకరకాల గాసిప్స్ విన్పించాయి. తాజాగా చిరంజీవికి జోడిగా గోవా సుందరీ ఇలియానా నటించనుందనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కొరటాల శివ సినిమాలో చిరంజీవి ద్విపాత్ర అభినయం చేయనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పక్కనే నటించే హీరోయిన్లలో జాబితాలో చాలా పేర్లు విన్పించాయి. ముఖ్యంగా అనుష్క, కాజల్ అగర్వాల్, నయనతార, శ్రద్ధా శ్రీనాథ్ పేర్లతోపాటు ఐశ్వర్య రాయ్ నటిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ జాబితాలో ఇలియానా పేరు చేరింది. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ బాటపట్టి టాలీవుడ్ కి కొంత దూరమయింది. తన నడుము అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేయడంలో ఇలియానాకు ఏ హీరోయిన్ పోటీలేదనే చెప్పచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో పాగల్ పంతీ మూవీలో నటిస్తుంది. టాలీవుడ్లో చివరగా ఇలియానా 2012లో దేవుడు చేసిన మనుషులు సినిమాలో రవితేజతో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రవితేజ నటించిన అమర్, అక్బర్, ఆంటోనీ మూవీలో నటించింది.

nayanatara, chirajneevi, ilieyana

చిరంజీవి 150 చిత్రం ఖైదీ, 151 సినిమా సైరా, 152వ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రబృందం ఇలియానాకు కథను విన్పించగా చిరుకు జోడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ గోవా భామ. ఇటీవల సినిమాల కంటే పర్సనల్ విషయాలతో ఇలియానా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన ప్రియుడు ఆండ్రూనీబోన్ కి బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. తాజాగా చిరుతో రోమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

చిరు సరసన మలయాళ బ్యూటీ నయనతార ఇప్పటికే ఒక కథనాయికగా ఖరారైనట్లు సమాచారం. చిరంజీవి ఒక క్యారెక్టర్లో నక్సలైట్ తరహా పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. కొరటాల సినిమాలన్నీ సామాజిక చైతన్యం కలిగించేలా ఉంటాయి. చిరంజీవితో కూడా సామాజిక అంశాన్ని ఫోకస్ చేసేలా కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే హీరోయిన్ల విషయంలో నయనతార, ఇలియానా ఖరారైనట్లు వార్తలు విన్పిస్తున్నా.. కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏదిఏమైనా మెగా అభిమానులను దృష్టిలో ఉంచుకొని గ్లామర్ హీరోయిన్ల వైపే దర్శకుడు మొగ్గు చూపడం ఖాయం. చిరంజీవితో ఆడిపాడే అవకాశం ఏ హీరోయిన్లను వరిస్తుందో చూడాలి మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *