page contents

Is there a threat to life for hours on end?

గంటలతరబడి కూర్చుంటే ఆయుష్షుకు ముప్పు తప్పదా?

గంటల తరబడి కూర్చొని పనిచేసే వారి ఆయష్షుకు ముప్పు ఉందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడయింది. నార్వేజియన్ స్పోర్ట్స్ స్కూల్ పరిశోధకుల అధ్యాయనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రతిరోజు నిద్రను మినహాయిస్తే రోజులో 9గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వారి సగటు ఆయుర్ధాయం కంటే ముందుగానే మృత్యువాత పడుతున్నట్లు పరిశోధనలో వెల్లడయిందని నార్వేజియన్ స్పోర్ట్స్ స్కూల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

back pain

అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం 18నుంచి 64ఏళ్ల వయస్సు ఉన్నవారు వారానికి కనీసం 75నిమిషాల వ్యాయామం చేయాలి. కానీ చాలామంది వ్యాయమం చేయడంలేదని తేలిందని పేర్కొన్నారు. ఇటీవల డబ్ల్యుహెచ్ఓ 36,383మందిపై అధ్యాయనం చేసి వివరాలను వెల్లడించింది. వీరిలో నుంచి అతి తక్కువ వ్యాయామం, శారీరక శ్రమలేని 2,149మంది తమ సగటు జీవితకాలం కంటే ముందుగానే మృత్యువాత పడినట్లు ఆ పరిశోధనలో వెల్లడయిందని పేర్కొంది. కావున గంటల తరబడి కూర్చొని పనిచేసే వారు శారీరక శ్రమ, వ్యాయమం వంటివాటిపై దృష్టిసారిస్తే మేలు కలుగుతుంది.

గంటల తరబడి కూర్చోవాల్సి వస్తే ఇవి పాటించండి..

  • నిటారుగా కూర్చోవడం, నడుము వంచరాదు, వెన్నెముక నిటారుగా ఉంచాలి.. సరైన భంగిమలో కూర్చోవాలి.. అనే సాధారణంగా వైద్యులు చెప్పే మాటలు. కానీ వీటిని ఎక్కువ మంది పాటించడం లేదు. ఇవి పాటిస్తే సాధారణంగా సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
  • సరైన భంగిమలో కూర్చోకపోతే వెన్నుముక దిగువన వీపునొప్పి కలుగుతుంది. ఇది పనిలో ఏకగ్రత దెబ్బతినేలా చేస్తుంది. అలాగే సరైన భంగిమ కొనసాగించకపోవడం వల్ల శరీరం ఆక్సిజన్ స్థాయిని కొల్పోతుంది. ఇది నిరసం రావడానికి కారణమవుంది.
  • నేటి కార్పోరేట్ యుగంలో కార్యాలయంలో లభించే కుర్చీలు నడుము నొప్పులను నివారించేలా తయారు చేయబడుతున్నాయి.
  • మీరు కూర్చొని చోట కుర్చీ సరిగ్గా లేనపుడు చిన్నదిండును నడుముకు ఆసరాగా ఉంచుకోవాలి.
  • సీటు యొక్క వంపుపై వెన్నెముక ఉండేలా వెనక్కి కూర్చోవాలి. టేబుల్ కింద ఖాళీని ఉపయోగించుకోవాలి. వెన్నముక నిటారుగా ఉండేలా కాళ్లను లోపలికి ఉంచాలి.
  • చేతికి కుర్చీ ముంజేతులపై ఉంచి అప్పుడు పని చేయాలి. వంకరగా కూర్చోకుండా ఉండటానికి మీ వెన్నముకను కుర్చీ వెనుక భాగానికి ఆసరా చేసుకోవాలి.
  • కంప్యూటర్ తో పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు సాధారణంగా ఉంచుకునే స్థానం కంటే ఎక్కువ స్థానంలో మీ మానిటర్ ఉంచుకోవాలి. మీ రెండు పాదాలు నేలకు తాకుతూ ఉండాలి. అలాగే కాళ్లు వేలాడే విధంగా కుర్చీ ఎత్తును పెంచొద్దు.
  • ప్రతి 15నిమిషాలకోసారి విరామం తీసుకోవాలి. 15సెకన్ల పాటు మెడను అటూ, ఇటూ తిప్పాలి. సాధ్యమైనంత వరకు కళ్లను మూసి తెరవాలి. మాత్రం మధ్యమధ్యలో లేచి అటు,ఇటు నడవడం, ఎక్కువగా నీళ్లు తాగడం వంటి పనులు చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునే చిట్కాలు పాటించడం వల్ల సాధ్యమైనంత వరకు వైద్యులకు దూరంగా ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *