page contents

Ismart Beauty nabha natest is the sign for the new movie

కొత్త కుర్రాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇస్మార్ట్ భామ

ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ ఓ బిగ్ హిట్ అందుకొంది. ఈ సినిమా హిట్ తో ఈ భామకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే నభా నటేష్ ఇప్పటివరకు  ఏ సినిమాకు సైన్ చేయలేదు. కాగా తాజాగా ఓ సినిమాకు సినిమాకు ఇస్మార్ట్ బ్యూటీ సైన్ చేసింది. ఈ మూవీలో ఓ కొత్త కుర్రాడు హీరోగా నటిస్తున్నాడు.

Nabha natesh in saree

కొత్త కుర్రాడితో రొమాన్స్ కి రెడీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డబ్ల్యూ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా జయదేవ్ నిర్మిస్తున్నారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్గా నటించేందుకు నభా నటేష్ ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందటా. కొత్త కుర్రాడి పక్కన నటించేందుకు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందటా. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో స్కీన్ షో చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కొత్తకుర్రాడితో రోమాన్స్ ఓ రేంజ్లో ఉండబోతుందని సమాచారం.

nabha natesh latest

కాగా ఈ సినిమా గతంలో దిల్ రాజు బ్యానర్లో ప్రారంభమై ఆగిపోయింది. తాజాగా ఇస్మార్ట్ భామ కొత్తకుర్రాడి పక్కన నటించేందుకు అంగీకారంతో తెలుపడంతో ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకు మహేష్ బాబు ఆశీస్సులు ఉండటం వల్లే ఇస్మార్ట్ బ్యూటీ ఈ ఆఫర్ ఒప్పుకుంది. ఇస్మార్ట్ భామ మహేష్ అల్లుడిని లైన్లో పెట్టి.. మామ(మహేష్ బాబు)కి గాలం వేస్తోంది. ఏదిఏమైనా ఇస్మార్ట్ బ్యూటీ ఒకే దెబ్బకు రెండు ఆఫర్లు ప్లాన్ బాగుందని పలువురు అంటున్నారు. రవితేజ-నభా నటేష్ నటిస్తున్న డిస్కో రాజా మూవీతో త్వరలో సినిమా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం మంచి ఆఫర్లను మాత్రమే ఒప్పుకుంటూ ఇస్మార్ట్ అనిపించుకుంటోంది.

ఇస్మార్ట్ ఆఫర్లు దక్కింకుంటున్న నభానటేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *