page contents

Jersey heroine side opposite Chiru?

చిరు సరసన జేర్సీ భామ?

chiru sraddasrinath

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా నర్సింహారెడ్డి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం డబ్బింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విడుదల చేయాలని సన్నహాలు చేస్తున్నారు. కాగా 152వ చిత్రం దర్శకుడు కోరటాల శివ దర్శకత్వంలో రాబోతుండటంతో తదుపరి చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించిన సంగతి తెల్సిందే. రీసెంట్ మహేష్ బాబుతో తీసిన భరత్ అనే నేను సినిమా కూడా ప్రేక్షకుల మన్నలను పొందిందింది.

chiru sradda srinath

కోరటాల శివ సినిమాలన్నీ కమర్షియల్ గా ఉండటంతోపాటు సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చేవిగా ఉంటాయి. చిరంజీవి సినిమాల్లో కూడా ఏదో ఒక సోషల్ మేసేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అనుష్క, శ‌ృతిహాసన్, నయనతార, తమన్న పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఇందులో చిరు పక్కన రెండో హీరోయిన్ గా ఇటీవల విడుదల జేర్సీ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని పక్కన నటించిన శ్రద్దా శ్రీనాథ్ కాన్ఫామ్ అయినట్టు సమాచారం. జేర్సీ మూవీలో ‘సారా’గా నటించిన శ్రద్దా శ్రీనాథ్ అభినయానికి ముగ్ధుడైన కోరటాల శివ చిరంజీవి పక్కన రెండో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్లు సీనివర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రెండో హీరోయిన్ గ్లామర్ ప్రాధాన్యంగా ఉండనుందని సమాచారం. అయితే చిరుతో సారా రోమాన్స్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది.

chiru with sradda srinath

ఇప్పడున్న కథనాయికల్లో చిరంజీవి పక్కన జేర్సీ భామ కారెక్ట్ గా సరిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే నయనతార, తమన్నా సైరా మూవీలో నటిస్తున్నందున వారికి చిరంజీవి తదుపరి సినిమాలో అవకాశం అంతంతమాత్రమే. ఇక అనుష్క స్టాలిన్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ చిరంజీవి పక్కన తళుక్కన మెరిసింది. అంతేకాదు సైరాలో వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఈ కథనాయిక అవకాశం కూడా అంతంత మాత్రంగానే కన్పిస్తున్నాయి. ఇక శృతిహాసన్ ఇప్పటికే రాంచరణ్, పవన్ కల్యాణ్, బన్ని పక్కన నటించి మెప్పించింది. అయితే కమల్ హాసన్ సమకాలీకుడైన చిరంజీవి పక్కన శృతిహాసన్ నటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఏదిఏమైనా జెర్సీ మూవీలో అందరి మన్నలను పొందిన సారా చిరంజీవితో కలిసి నటించబోతుందని తెలియడంతో ఈ సినిమా ఎప్పడెప్పుడూ మొదలవుతుందా అని మెగా అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఏదిఏమైనా మంచి సోషల్ మెసేజ్ సినిమాలు తీసే కోరటాల శివ-చిరంజీవి కాంబినేషన్లో త్వరలో మూవీ ప్రారంభం కానుండటంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని సినీ అభిమానులు చెబుతున్నారు. తెలుగులో మొదటి సినిమాతోనే మెప్పించిన జేర్సీ రెండో సినిమాకే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. లక్ అంటే అంటే జేర్సీ భామదే అనేది పలువురు అంటున్నారు.

chiraneevi sradda srinath latest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *