page contents

Mahesh Romance will be ready with three heroines

ముగ్గురు భామలను లైన్లో పెట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకేసారి ముగ్గురు భామలను లైన్లో పెట్టాడు. మహేష్ తాజా చిత్రం సరిలేరునికెవ్వరులో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించానున్నారని సమాచారం. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరోహీయిన్లుగా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం తమన్నా నటించనుంది. తాజాగా ఈ చిత్రంలో మరో బ్యూటీ నటించనుందని వార్తలు విన్పిస్తున్నాయి.

puja hegde mahesh rashimka tamanna(sarileru nekevvaru)

పూజను వదలనంటున్న మహేష్..

రంగస్థలం మూవీలో రాంచరణ్ తో కలిసి జిగేల్ రాణిగా ప్రత్యేక గీతంతో అలరించిన బ్యూటీ పూజాహేగ్డే. ఈ భామ ఇప్పుడు మహేష్ పక్కన సరిలేరునికెవ్వరు చిత్రంలో ఓ పాటలో నటించబోతుందని గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఇప్పటికే పూజా హేగ్డే మహేష్ తో ‘మహర్షి’ మూవీలో నటించింది. ఈ చిత్రంలో మహేష్ కి సరైన జోడిగా పూజా హేగ్డే మెప్పించింది. ఇటీవలే పూజ నటించిన గద్దలకొండ గణేష్ మూవీకి హిట్ టాక్ రావడంతో వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ఈ సినిమాలో పాతతరం నటి శ్రీదేవీ సాంగ్ వెల్లువచ్చెగోదారమ్మ.. అంటూ సాగే సాంగ్ పూజా హెగ్డే తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి మార్కులు కొట్టేసింది. మహేష్ కు సరైన జోడిగా ఉన్న పూజను తన తదుపరి మూవీ తీసుకున్నారంటే ఆ జోడికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజీ వుందో అర్థం చేసుకోవచ్చు. మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఓ ప్రత్యేక గీతంలో మహేష్ తో ఆడిపాడనుండటంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

mahesh babu puja hegde

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న పూజను ఈ చిత్రంలో తీసుకోవడం ద్వారా ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. కామెడీ ఎంటర్టైన్ గా సరిలేరునికెవ్వరు చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావుపూడి తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రంలో ఒకేసారి మహేష్ ముగ్గురు భామలతో రోమాన్స్ చేస్తూ తనకెవరూ సాటిలేరంటున్నాడు మహేష్. ఇక ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకరకంగా విజయశాంతికి ఈ సినిమా రీ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, తమన్నాతోపాటు పూజా హేగ్డే చేరడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *