page contents

Mega combination is not just ..!

మెగా కలయిక ఇప్పుడే కాదు..!

మెగాస్టార్ చిరంజీవి, దివంగత వైఎస్ రాజశేఖర్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలయిక శుక్రవారం ఉదయం 11గంటలకు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే 11తేదిన వారివురి బేటీ జరుగలేదు. 11తేది ఉదయం 11గంటలకు చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే అనుకొని కారణాల వల్ల ఈ బేటీ వాయిదా పడినట్లు సమాచారం.

వీరి కలయికపై మొదలైన చర్చ..

ys jagan with chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేటి అనగానే అటూ సినీ, ఇటూ రాజకీయవర్గాల్లో అప్పుడే జోరుగా చర్చ మొదలైంది. దీంతో ఈ బేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయంగా ఎలాంటి అంశాలు ఉండబోవని మెగా వర్గాలు చెబుతున్నాయి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథాంశంగా చిత్రీకరించిన సైరా మూవీని చూడాలని జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలబోతున్నట్లు వినికిడి. కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి ప్రాణం పెట్టి నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకు మరింత ప్రమోషన్ కల్పించడంలో భాగంగా చిరంజీవి పలువురి ప్రముఖులను కలిసి సినిమా చూడాలని కోరుతున్న సంగతి తెల్సిందే. ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కోరగా ఆమె ఫ్యామిలీ సహా సినిమాను వీక్షించారు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి కన్పించలేదని.. కేవలం ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి మాత్రమే కన్పించారంటూ మెగాస్టార్ కి తెలంగాణ గవర్నర్ కితాబిచ్చారు.

14వ వరకు ఆగాల్సిందే..

జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి జగన్ తాను అనుకున్న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బీజీగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి బేటీ అనగానే అన్నివర్గాల వారికి ఆసక్తి కలిగించేదే. అయితే సైరా మూవీ విడుదల సమయంలో చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో చిత్రబృందం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపేందుకు మర్యాదపూర్వకంగా కలవనుంది. ఈ సినిమాను చూడాల్సిందిగా మెగాస్టార్ జగన్మోహన్ రెడ్డి కోరనున్నారు. స్పెషల్ షో ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి సైరా మూవీని చూపించనున్నారు. అయితే వీరి కలయిక కోసం ఈనెల 14వరకు మెగా అభిమానులు, వైఎస్ అభిమానులు వెయిట్ చేయాల్సింది.

పండుగ చేసుకుంటున్న మెగా అభిమానులు

సైరాతో వన్స్ మోర్ అంటున్న త్రిష..

ఔరా.. అనిపిస్తున్న సైరా..

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్

మెగా సునామిని ఎవరూ ఆపలేరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *