page contents

Mega fans doing the festival

పండుగ చేసుకుంటున్న మెగా అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు సైరా నర్సింహారెడ్డికి హిట్ టాక్ రావడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5వేల థియేటర్లలో గాంధీ జయంతి రోజున సైరా చిత్రం విడుదలైంది. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సైరా సినిమాకు మంచి రేటింగ్, సూపర్ హిట్ టాక్ ఇస్తుండంతో మెగా అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

Chiranjeevi-Nayanatara-Tamanna

ఉదయం 8గంటల నుంచే సైరా బెనిఫిట్ షోలతో థియేటర్ల వద్ద సైరా సందడి మొదలైంది. సైరాలో చిరంజీవి నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. చిరంజీవితోపాటు అమితాబచ్చన్, కిచ్చా సుదీప్, జగతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నాలు చేసిన క్యారెక్టర్లు వారి పరిధి మేరకు చేసి మెప్పించారని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. సినిమా చిరంజీవిని చూస్తే 30ఏళ్ల కింద చూసిన చిరంజీవిలా కనిపిస్తున్నాడని అంటున్నారు. రత్నవేలు కెమెరా పనితనం, విజుల్ ఎఫెక్ట్ కళ్లకు కట్టినట్టు ఆనాటి స్వాతంత్ర్య పోరాటం చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. నిర్మాత రాంచరణ్ దర్శకుడి సురేందర్ రెడ్డిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని అంటున్నారు.

syaraa action scences

ఇక సినిమాలో ప్రారంభంలో, చివరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పే మాటలు, ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క, ఇంటర్వెల్ ముందే వచ్చే యాక్షన్ సన్నివేశం, క్లైమాక్స్ల్ వచ్చే యుద్ధసన్నివేశం, చిరంజీవిని ఉరి తీసే సీన్ వంటివి సినిమాలో హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక చిరంజీవి ఈ వయస్సులో కూడా గుర్రాలపై స్వారీ, చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదిఏమైనా ఈ సినిమాలో మెగాస్టార్ అంటే ఏంటో చూపించారని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో అందరి దృష్టి బాహుబలి రికార్డులపై ఉంది. సైరా బాహుబలిని క్రాస్ చేస్తుందా అని చర్చించుకుంటున్నారు. సినిమాకు సూపర్ హిట్ రావడం, పండుగ సెలవులు, మరో పెద్ద హీరో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో బాహుబలి రికార్డును తిరగరాయడం పెద్దకష్టమేమీ కాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా సినిమా చూసినవారంతా సైరాకు జాతీయ అవార్డులు రావడం ఖాయమని కితాబివ్వడం విశేషం.

ఔరా.. అనిపిస్తున్న సైరా..

మెగా సునామిని ఎవరూ ఆపలేరు!

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్

సైరాతో వన్స్ మోర్ అంటున్న త్రిష..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *