page contents

Mega Workouts-Fans Full Khushi

మెగా వర్కౌట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

మెగాస్టార్ చిరంజీవి జిమ్లో వర్కౌట్లు చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లో నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. ఖైదీ నెం.150తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితాధారంగా నిర్మించిన సైరా మూవీతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. 2019లో సైరా హిట్టుతో మెగా అభిమానులు పండుగ చేసుకున్నారు.

సైరా తర్వాత కొరటాల దర్శకత్వంలో చిరంజీవి 152వ సినిమా ప్రారంభమైంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక నవంబర్లో షూటింగ్ పనులు చేయాల్సి ఉండగా కాస్తా ఆలస్యంగా డిసెంబర్లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. సోషల్ పొలిటికల్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి లుక్ చాలా ఫిట్, స్టైలీష్ గా ఉండబోతుంది. అందుకుగాను చిరంజీవి కొంత బరువు తగ్గే పనిలో భాగంగా జిమ్లో ఇలా వర్కర్లు చేస్తున్నారు.

mega workouts

సైరా మూవీ హిట్టైనప్పటికీ ఈ మూవీలో చిరంజీవి బరువు, లుక్స్ పై పలువురు కామెంట్లు చేశారు. చిరంజీవి లుక్స్ పై ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా వీటన్నింటిని మెగా ఫ్యాన్స్ పట్టించుకోలేదు. కానీ చిరంజీవిపై ఎవరైనా సద్విమర్శ చేస్తే చక్కదిద్దుకునేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగానే 64ఏళ్ల వయస్సులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదన్నట్టు వ్యాయమం చేస్తూ కనిపించారు. తనలోని ఈ హార్డ్ వర్కే చిరంజీవిని మెగాస్టార్ చేసిందని అభిమానులు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష ఒక హీరోయిన్ గా ఖరారైందని, సినిమాలో ఓ కీలక పాత్రలో తెలుగుమ్మాయి ఈషా రెబ్బ కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే తమన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే కథ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్న దర్శకుడు కొరటాల శివ ఇక హీరోయిన్లను ఖరారు చేసిలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ పాటతోనే ప్రారంభం కాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సైరాలో చిరంజీవి స్టైప్పులు మిస్సయ్యాం అనుకునే వాళ్లకు ఈ సినిమాతో ఆ లోటు తీరడం ఖాయంగా కనిపిస్తోంది.

చిరంజీవితో జతకట్టనున్న తమన్నా?

చిరంజీవితో వన్స్ మోర్ అంటున్న త్రిష

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *