Nithya Menon’s entry into Bollywood

By | July 19, 2019

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నిత్యా మీన‌న్‌

బాలీవుడ్‌లోకి మ‌రో సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను నిత్యా మీన‌న్ ఆక‌ట్టుకుంది. ద‌క్షిణాదిలో ఈ ముద్దుగుమ్మ‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ బాట‌ప‌ట్టింది. మిష‌న్ మంగ‌ళ్ పేరిట బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రంలో నిత్యామీన‌న్ శాటిలైట్ డిజైన‌ర్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

nithya menon

2013లో భార‌త్ ప్ర‌యోగించిన మంగ‌ళ‌యాన్ మిష‌న్ నేప‌థ్యంలో మూవీ..

భార‌త్ శాస్త్ర‌వేత్త‌లు 2013లో మిష‌న్ మంగళ్‌యాన్ ప్ర‌యోగించి భార‌త్ కీర్తి ప‌తాకాన్ని విశ్వ‌వ్యాప్తంగా రెప‌రెప‌లాడించారు. ఈ ప్ర‌యోగంతో భార‌త్ అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుంది. అగ్ర‌రాజ్యాలకు భార‌త్ స‌త్తా ఏంటో చూపించింది. ఈ నేప‌థ్యంలో సినిమా వ‌స్తుండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. అస‌లు మంగ‌ళ్‌యాన్ ప్ర‌యోగానికి ఎలా బీజం ప‌డింది.. మిష‌న్ ప్ర‌యోగానికి సంబంధించి శాస్త్ర‌వేత్త‌లు ప‌డిన త‌ప‌న‌, ప్రయోగంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించారో ఈ మూవీలో ప్రేక్ష‌కుల‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌బోతున్న‌ట్టు తెల్సింది.

ట్రెండింగ్‌లో మిష‌న్ మంగ‌ళ్ మూవీ ట్రైలర్..

ఈ మూవీ ట్రైల‌ర్ గురువారం విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ మూవీ ట్రైల‌ర్ అత్య‌ధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ శాస్త్ర‌వేత్త‌గా (మిషన్ డైరెక్టర్) నటిస్తున్నారు. రాకేష్ ధావ‌న్‌(అక్ష‌య్ కుమార్‌) ఉప‌గ్ర‌హాన్ని అంగ‌రాకుడిపై పంపించాల‌ని ప్ర‌తిపాదిస్తాడు. అయితే అందుకు త‌గ్గ నైపుణ్యం ఎవరి వ‌ద్ద లేదు. దీంతో భార‌త శాస్త్ర‌వేత్త‌లు ఉపగ్ర‌హాన్ని మార్స్ మీదికి ఏవిధంగా పంపారో అనేది చాలా ఎంట‌టైన్‌గా రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ట్రైల‌ర్ అక్ష‌య్‌కుమార్  ’ఎక్స్‌పెరిమెంట్ లేనిదే సైన్స్ లేదు.. ప్ర‌యోగాలు చేయ‌కుండా మ‌న‌కి మ‌నం శాస్త్ర‌వేత్త‌లం అనిపించుకోం‘ మంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

mission mangal

ఈ చిత్రంలో నిత్యామిన‌న్‌తోపాటు విద్యాబాల‌న్‌, తాప్సీ, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హారి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న నిత్యామిష‌న్ చిత్రం విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌న్పిస్తోంది. జ‌గ‌న్ శ‌క్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఆగ‌స్టు 15(స్వాతంత్య దినోత్స‌వ‌) కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్రేక్ష‌కులు ఈ మూవీ విడుద‌ల కోసం అత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *