page contents

Once More says Trisha

వన్స్ మోర్ అంటున్న త్రిష..

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో మరో పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి పక్కన హీరోయిన్ గా త్రిష అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల శివ ఆమె సంప్రదించినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఇందుకు త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటికే త్రిష ఆడిపాడారు. 2006లో వచ్చిన స్టాలీన్ మూవీలో మెగాస్టార్ పక్కన తొలిసారి నటించింది. ఈ సినిమాలో చిరంజీవికి సరైన జోడి అనిపించింది. ప్రేక్షకుల నుంచి వీరి జోడికి మంచి ఆదరణ లభించింది. చిరంజీవి 152లో మూవీలో ఇప్పటికే హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. నయనతార, కాజల్, అనుష్క, శ్రద్ధా శ్రీనాథ్ పేర్లు ఎక్కువగా విన్పించాయి. ఇటీవల ఐశ్వర్యరాయ్, శృతిహాసన్, కీర్తి సురేష్, ఇలియానా పేర్లు రాగా అధికారికంగా ఎవరి పేర్లను దర్శకుడు ప్రకటించలేదు.

trisha-chiranjeevi

చిరంజీవి 152లో మూవీలో మెగాస్టార్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో చిరు పక్కన హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. దర్శకుడు కొరటాల చిరు పక్కన త్రిష అయితే బాగుంటుందని ఇటీవల సంప్రదించగా ఆమె ఒకే చేశారని సమాచారం. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ హీరోయిన్ గా ఉన్న త్రిష ఇటీవల కాలంలో తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు. తమిళంలోనూ అడపదడపా మూవీలు తీస్తున్నారు. తెలుగులో త్రిషకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే చిరు-త్రిష జోడికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. వీరి కాంబినేషన్లో మూవీ వస్తుందనగానే సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా అక్టోబర్ 2 గాంధీ జయంతిన విడుదలయ్యే సైరా మూవీ కోసం మెగా అభిమానులతో సినీ అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

చిరుతో ఆటకు సై అంటున్న గోవా సుందరీ!

న‌య‌న్‌తో వ‌న్స్‌మోర్ అంటున్న చిరు!

చిరు సరసన జేర్సీ భామ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *