page contents

Only on screen.. There is no such thing in real life: Rakul

తెరపై మాత్రమే అలా.. నిజజీవితంలో అలాంటివి లేవు : రకుల్

మన్మథుడు-2 సినిమాలో తాను అవంతిక క్యారెక్టర్ కోసం సిగరెట్ తాగాల్సి వచ్చింది తప్పా.. నిజజీవితంలో అలాంటి అలవాటు తనకు లేదని హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ తెలిపింది. ఈనెల 9న(శుక్రవారం) మన్మథుడు-2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాకు సంబంధించిన విశేషాలను రకుల్ ప్రీతిసింగ్ మీడియాతో పంచుకుంది.

rakul preeth singh in manmadu-2

మన్మథుడు-2లో తాను ఇంతవరకు చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నానని రకుల్ తెలిపింది. అవంతిక అనే యువతీ క్యారెక్టర్ కోసం తెరపై తాను ఒకటి రెండుచోట్ల స్మోక్(సిగరెట్) చేయాల్సి వచ్చిందని తెలిపింది. అవంతిక అనే యువతికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అందులో భాగంగానే తాను స్మోక్ చేయాల్సి వచ్చింది. లోకంలో ఇలాంటి చాలా మనకు కనిపిస్తుంటాయని, దాని గురించి ఎవరూ అడగరని అన్నారు. కానీ తెరపై హీరోయిన్ స్మోక్ చేస్తే మాత్రం నిలదీస్తారని, అదే హీరో చేస్తే తప్పుగా కనిపించదా? అంటూ ప్రశ్నించింది. తెరపై కొంచెం సేపు కనిపించే దృశ్యాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని రకుల్ ప్రీతిసింగ్ చెప్పింది.

rakul preeth nagarjuna walk

అలాగే ఈ సినిమాలో నాగార్జునతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయనపై చాలా గౌరవం పెరిగిందని చెప్పింది. నాగార్జున గారు తన పాత్రకు తగ్గట్టు నటిస్తారే తప్ప హీరోయిజం కోసం ఆలోచించరని తెలిపింది. తాను సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తానని, తనకు కథే ఇంపర్టెంట్ తప్ప హీరో వయస్సుతో సంబంధం లేదని తెలిపింది. ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తోనే తన తొలి తెలుగు మూవీ వెంకట్రాది ఎక్స్ ప్రెస్ చేశానని తెలిపింది. రాహుల్ తనకు అవంతిక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ సినిమాను చేయాలని అనుకున్నానని చెప్పింది. తాను ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నానని రకుల్ ప్రీతిసింగ్ తెలిపింది. మన్మథుడు-2 చాలా భావోద్వేగాలతో కూడుకున్న ఫ్యామిలీ ఎంటటైనర్ అని చెప్పింది. ఇది కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా అని రకుల్ ప్రీతిసింగ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *