page contents

Puri’s son is another idiot!

పూరి తనయుడు మరో ఇడియట్!

దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి మరో ఇడియట్ గా మారిపోయాడు. అదేనండి.. పూరి జగన్మాథ్ ‘ఇడియట్’ మూవీ తరహాలోనే ఆకాష్ పూరి నటిస్తున్న‘రోమాంటిక్’ మూవీ ఉండబోతుందని సమాచారం. ఇడియట్లో రవితేజ క్యారెక్టర్ మాదిరిగానే ఆకాశ్ పూరి క్యారెక్టర్ రోమాంటిక్ మూవీలో ఉండబోతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మాట ఎంతవరకు వాస్తవమో తెలియదుగానీ యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునేగా మాత్రం ఆకాష్ పూరి క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది.

romatic movie

ఆకాష్ పూరి నటించిన రోమాంటిక్ మూవీ ఫస్ట్ లూక్ విడుదలైంది. సినిమా పేరు తగ్గట్టుగానే రోమాంటిక్ మూవీలో రోమాన్స్ పీక్ స్టేజ్లో ఉంటుందని చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లూక్ చూస్తేనే తెలుస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో ఆ తర్వాత వస్తున్న మూవీలు కూడా అదే కోవాలో వస్తున్నాయి. ఆకాశ్ పూరి, కేతికాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రోమాటింక్ మూవీని అనిల్ పాడూరి దర్శకత్వం వస్తున్నాడు. ఈ సినిమాకు పూరి జగన్మాథ్ నిర్మాతగా వ్యవహరిస్తుడం విశేషం.

కాగా చిత్రయూనిట్ విడుదల చేసిన ఫస్టు లుక్ ను ఈ సినిమా యుూత్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా పోస్టర్లో హీరోయిన్ కేతికా శర్మ టాప్ లెస్ గా కనిపించగా హీరో ఆకాశ్ పూరి ఆమెను తన బిగి కౌగిలిలో బంధిస్తాడు. హీరోయిన్ బ్యాక్ లెస్ ప్రేక్షకులకు కనిపిస్తుండగా హీరో ముందునుంచి తనను గట్టిగా హాగ్ చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ఉంది సినిమా పోస్టర్. తన తనయుడిని స్టార్ హీరోగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పూరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ లోకి పూరి వచ్చాడు. తన తనయుడి నటిస్తున్న రోమాంటిక్ మూవీ కూడా హిట్ అయ్యేందుకు అన్నివిధలా సహకరిస్తున్నాడు. ఏదిఏమైనా రోమాంటిక్ ఫస్టు లుక్ లోనే అదిరిపోయే రోమాన్స్ చూపిస్తున్న దర్శకుడు అనిల్ పాండే సినిమాలో ఎంకేన్ని రోమాంటిక్ సన్నివేశాలు తీశాడో చూడాలని సినిమాకు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *