Rajanna Laddu has raised the price!

By | August 1, 2019

రాజన్న లడ్డూ ధరను కూడా పెంచేశారుగా!

భక్తుల పాలిట కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీరాజరాజేశ్వరస్వామి. దక్షిణకాశిగా పేరొందిన శ్రీవేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శివాలయం. అయితే తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల లడ్డూ ప్రసాదాల రేట్లు పెరిగాయి. ఈమేరకు రాజన్న దేవాలయంలోనూ ఆగస్టు 2నుంచి పెరిగిన  ధరలు అమల్లోకి రానున్నాయి.

పెరిగిన ప్రసాదం ధరలు..

ప్రస్తుతానికి 80గ్రాముల లడ్డూ ధర రూ.15కి విక్రయిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి లడ్డూ సైజు 100గ్రాములకు పెంచి ప్రసాదం ధర రూ.20కి విక్రయించనున్నారు. అలాగే పులిహోర 200గ్రాములు రూ.10 గతంలో ఉండగా దీనిని 250గ్రాములకు పెంచి రూ.15కు, అభిషేకం లడ్డూ గతంలో రూ.400 గ్రాములు(రూ.50) ఉండగా దీనిని 500గ్రాములకు పెంచి రూ.100కు విక్రయించనున్నారు. కల్యాణం లడ్డూ ధర 800గ్రాములు(రూ.100) గతంలో ఉండగా దీనిని 1000గ్రాములకు పెంచి రూ.200లకు పెంచాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

నిర్వహాణ ఖర్చులు, ప్రసాదం తయారీకి అవుతున్న ఖర్చులు పెరిగినందువల్లనే లడ్డూ ప్రసాదం ధరలు పెంచాల్సి వచ్చిందని ఆలయ కమిటీ పెద్దలు చెబుతున్నారు. లడ్డూ పరిమాణం పెంచి ధరలు పెంచడం జరిగిందని, ధరలు మరీ ఎక్కువగా ఏమీ పెంచలేదని తెలిపారు. ఆగస్టు 2నుంచి శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాస్థానంలో పెరిగిన ధరలు అమలు కానున్నాయని ఇందుకు భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ పెద్దలు కోరుతున్నారు.

vemulawada temple

రాజన్న భక్తుల్లో అధికంగా సామన్యులే ఎక్కువగా ఉంటారు. వీరిని దృష్టిలో ఉంచుకొని అభిషేకం లడ్డూ, కల్యాణం లడ్డూ ధరను కొంతమేరకు తగ్గించాలని భక్తులు విన్నవిస్తున్నారు. దీనిపై శ్రీరాజరాజేశ్వర దేవస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే పెరిగిన ధరలు మాత్రం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానున్నాయని దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *