page contents

Rajinikanth Mass Look Superb In darbar motion poster

కత్తి పట్టి.. రఫ్పాడించిన అరుణాచలం

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ ను తెలుగు, తమిళం, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్బార్ మోషన్ పిక్చర్ ను తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేశాడు. ‘రజనీ సార్ అంటే తనకు ఎల్లప్పుడూ అభిమానమని‘ ట్వీట్ చేశాడు. ఇక తమిళంలో కమలహాసన్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ దర్బార్ పోస్టర్లను విడుదల చేశారు.

రజనీ పక్కా మాస్.. అదిరిపోయిన మోషన్ పోస్టర్..

darbar motion poster telugu

దర్బార్ మూవీలో రజనీకాంత్ పేరు ఆదిత్య అరుణాచలం. గతంలో రజనీకాంత్ నటించిన అరుణాచలం మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తాజాగా అదే పేరుతో రజనీకాంత్ దర్బార్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మహేష్ బాబు విడుదల చేసిన తెలుగు దర్బార్ పోస్టర్ రజనీకాంత్ ఖాకీ(పోలీస్) డ్రెస్ వేసుకొని పక్కా మాస్, స్టయిలీష్ లుక్కుతో అదరగొట్టాడు. మరొపక్క కత్తి పట్టుకొని విలన్లను రఫ్ఫాడించాడు. ఇక హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉండి అభిమానులకు కిక్కునిచ్చేలా ఉంది. ప్రస్తుతం దర్బార్ మూవీ న్యూస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ సంస్థ దర్బార్ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తుండగా ఓ కీలకపాత్రలో నివేదా థామస్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణ పనులు పూర్తి చేసుకొంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *