page contents

Ramcharan has not received an award for Tollywood politics?

టాలీవుడ్ రాజకీయాల వల్లే రాంచరణ్ కి అవార్డు రాలేదా?

తెలుగు సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్లే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి జాతీయస్థాయి అవార్డు లభించలేదనే చర్చ నడుస్తోంది. టాలీవుడ్లో నాన్ బహుబలి రికార్డు రంగస్థలం పేరిటే ఉంది. ఈ మూవీలో రాంచరణ్ అద్భుత నటనను కనబరిచాడు. జాతీయస్థాయిలో పోటీపడిన చిత్రాలతో పోలిస్తే రంగస్థలం మూవీలో రాంచరణ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యే అవకాశం మెరుగ్గా ఉంది. అయినప్పటికీ రాంచరణ్ కి జాతీయ స్థాయిలో అవార్డు రాలేదు. రంగస్థలం మూవీ కేవలం సౌండ్ మిక్సింగ్ లో మాత్రమే ఒకే అవార్డు రావడంపై మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి జాతీయ స్థాయిలో సరైన ప్రాధాన్యం లభించలేదనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ టాలీవుడ్లో రికార్డులను తిరగరాసింది. నాన్ బహుబలి రికార్డు ఇప్పటివరకు రంగస్థలం మూవీపైనే ఉంది. రాంచరణ్ ఈ సినిమా చెవిటివాడిగా అద్భుత నటనను కనబరిచాడు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను పొందింది. రాంచరణ్ నటనకుతోడు సమంత గ్లామర్, సుకుమార్ దర్శకత్వం ప్రతిభ కలిసి ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.

ramcharan

అయితే తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు తమ మూవీకి అవార్డులు రావాలని లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీని వల్లే రంగస్థలం మూవీకి జాతీయ స్థాయి అవార్డుల్లో తగిన ప్రాధాన్యత లభించలేదని ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. తెలుగులో సినిమాలకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో ఇలాంటి విమర్శలు వచ్చేవి. కాగా ప్రస్తుతం జాతీయ అవార్డుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లాబీయింగ్, ఇతర కారణాల వల్ల సినిమాలను అవార్డులకు ఎంపిక చేయద్దని, కేవలం నటన ఆధారంగానే అవార్డులు ఇవ్వాలని కొందరు సీని ప్రియులు కోరుతున్నారు. రంగస్థలం మూవీలో ఉత్తమ నటన చేసిన రాంచరణ్ అన్ని విధలా జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు అర్హుడని అభిమానులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *