page contents

Rancharan is calling .. Beauty is not?

రాంచరణ్ పిలిచినా.. రాలేనంటున్న బ్యూటీ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఆ  హీరోయిన్ ను పిలిచినా సినిమా ప్రమోషన్ కి రావడంపై క్లారిటీ ఇవ్వడం లేదట. కొణిదల ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా రాంచరణ్ నిర్మించిన సైరా మూవీ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది సంగతి తెల్సిందే. ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ అదిరే రేంజ్లో చేయాలని చూస్తున్నారు. అయితే సైరా హీరోయిన్ నయనతార మాత్రం సినిమా ప్రమోషన్ విషయంలో ఝలక్ ఇస్తోందని ఫిల్మీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ramcharan nayanatara

ఇప్పటికే సైరా ప్రమోషన్లో భాగంగా  వివిధ భాషల్లో టీజర్ ను విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది చిత్ర బృందం. టీజర్ సందర్భంగా ముంబైలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, మిల్కి బ్యూటీ తమన్నా, ఈ చిత్రంలో నటించిన పలు భాషల్లోని స్టార్లు హాజరై ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, మళయాళ బ్యూటీ నయనతార హాజరు కాలేదు. అయితే అమితాబచ్చన్ చివరి నిమిషంలో రాలేకపోయినట్టు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి నయనతార రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నయనతార మొదటి నుంచి సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తోంది. అదేవిధంగా సైరా సినిమా విషయంలోనూ ఆవిధంగానే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. అయితే ఈ సినిమా మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితాధారంగా రూపొందించిన చిత్రం కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కి సహకరించమని రాంచరణ్ నయనతారను కోరాడట. ఇందుకు నయన్ కూడా అప్పటికి ఓకే చెప్పినా అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చే విషయంలో క్లారిటీ రావడం లేదట. అయితే రాంచరణ్ తెలుగు రాష్ట్రాల్లో సైరా కోసం ఓ బిగ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెల్సింది. ఈ ఈవెంట్ కి నయనతార వస్తోందని చెబుతున్నారని అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదట. ఒకవేళ నయనతార వస్తే మాత్రం సైరా మూవీ ప్రమోషన్ కి అదనపు ఆకర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే నయనతార అన్ని సినిమాల్లాగే ఈ చిత్రానికి దూరంగా ఉంటుందా? లేక రాంచరణ్ కోసమైనా సైరా ప్రమోషన్లో పాల్గొంటుందా? అని వేచి చూడాల్సిందే మరీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *