page contents

Rashmika is chasing Nitin

రష్మిక వెంటపడుతున్న నితిన్

హీరో నితిన్ రష్మిక మందన్నా వెంటపడుతున్నాడు. రష్మిక చిట్టి నడుము చూస్తూ చిత్రహింసలకు గురయ్యాడు మనోడు. ఇక వీరలెవల్లో రష్మిక నడుమును పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమె కంటపడి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదంతా కూడా భీష్మ టీజర్లో జరిగిందే.. ఈ టీజర్లో సినిమాకు సంబంధించిన స్టోరీని చెప్పకుండానే సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించడు దర్శకుడు వెంకీ కుడుముల. కేవలం 30సెకన్ల నిడివితో ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఉన్న టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

పవన్ మానియాలో నితిన్..

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి పెద్ద ఫ్యాన్. అది అందరికి తెల్సింది. అతని సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ ను గుర్తుచేసేలా పాటనో, మాటనో.. యాక్షన్ వంటివి జతచేసి అభిమానులకు ఆకట్టుకోవడం గత సినిమాల్లో చూసిందే. ఇక తాజాగా భీష్మ మూవీలోనూ పవన్ కల్యాణ్ మార్క్ కనిపించేలా టీజర్ ఉంది. గతంలో గుడుంబా శంకర్లో పవన్ కల్యాణ్-మీరాజాస్మిన్ తో చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలే అవుతున్నా.. అంటూ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాడు. అంతేనా ఖుషీలో పవన్-భూమికల నడుము ఎపీసోడ్ ఒక ట్రెండ్ ను సెట్ చేసింది. తాజాగా రష్మిక నడుము అందాలకు ఫిదా అయిన నితిన్ ఆమె నడుమును క్యాచ్ చేసేందుకు తిప్పలు పడుతూ కనిపించాడు.

beeshma in nithin rashmika mandana

రష్మిక నడుముకు విజయమల్యాకు లింక్!

రష్మిక నడుమును విజయమల్యాతో పొలుస్తూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ‘ నా లవ్ కూడా విజయమాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేం’ అంటూ సెటైరికల్ రోమాటింక్ డైలాగ్ వదిలాడు.. వేల కోట్లకు ఐపీ పెట్టిన బడా పారిశ్రామిక వేత్త విజయమల్యా కళ్లేదుటే తిరుగుతున్నా పట్టుకోరనే అర్థం వచ్చేలా చెప్పిన డైలాగ్ డైనమైట్ లా పేలింది. ఈ టీజర్ ద్వారా ఈ సినిమాలో రోమాంటిక్ ఎంటటైన్మెంట్ కి కొదవ ఉండదని చెప్పకనే చెప్పాడు. అయితే భీష్మ సినిమా ట్యాగ్ లైన్ మాత్రం సింగిల్ ఫర్ ఎవర్ ఉండటం మరింత ఆసక్తిని రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *