page contents

Ready for the Siara Pre release event?

మెగా ఈవెంట్ కి వేదిక రెడీ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా ఈవెంట్ కోసం వేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ సమర్పణలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవతాధారంగా సైరా మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. నిర్మాత రాంచరణ్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించిన ఒక అప్ డేట్ ఆసక్తిని రేపుతోంది.

సైరా ప్రీరిలీజ్ వేడుకలకు రాంచరణ్ అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ జిల్లాలో ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల 15న నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుండటంతో అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నహాలు జరుగుతున్నాయి.

saira pre release event

ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయళ నటుడు మోహన్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరురానున్నరని సమాచారం. సైరా నర్సింహారెడ్డి కథాంశం కర్నూల్ ప్రాంతానికి సంబంధం ఉండటం వల్లనే ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సైరా టీజర్ సంబంధించిన కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. సైరా ప్రీ రిలీజ్ కి కర్నూల్ ప్రాంతం వేదికగా మారుతుండటంతో ఇక్కడి మెగా అభిమానులు ఖుషీ చేసుకుంటున్నారు. ఏదిఏమైనా సైరా అప్డేట్ మెగా అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *