page contents

Real hero Telangana police

రియల్ హీరో తెలంగాణ పోలీస్..

వెటర్నరీ వైద్యురాలు(దిశా)పై నలుగురు యువకులు  అతికిరాతకంగా హత్యాచారం చేసి సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటన జరిగిన 8రోజుల తర్వాత దిశా నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ప్రజల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీస్ రియల్ హీరో.. జయహో సజ్జనార్.. జై తెలంగాణ అంటూ # ట్యాగ్ తో పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ కొనసాగుతోంది.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తీరు..

దిశాపై హత్యాచారం జరిగిన తీరు, నిందితుల నుంచి ఆధారాలు సేకరించే క్రమంలో సైబరాబాద్ పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు నలుగురు నిందితులను షాద్ నగర్ కి తీసుకెళ్లారు. నిందితులు దిశా సెల్ ఫోన్ దాచిపెట్టిన ప్రాంతాన్ని చూపిస్తమంటూ పోలీసులతో నమ్మబలికి ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లతో ఒక్కసారిగా పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు యత్నించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారిపై ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈసంఘటనలో నలుగురు నిందితులు మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. దిశా హత్య జరిగిన ప్రదేశానికి కేవలం 300మీటర్ల దూరంలోనే నిందితులు హతమైనట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగిన తీరును కొద్దిసేపట్లో సీపీ సజ్జనార్ మీడియా ముఖంగా వెల్లడించనున్నారు.

telangan police

జయహో సజ్జనార్.. శభాష్ తెలంగాణ పోలీస్

దిశా నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత తెలంగాణ పోలీసులు శభాష్.. జయహో సజ్జనార్.. శభాష్ తెలంగాణ పోలీస్, జై  తెలంగాణ అంటూ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఎన్ కౌంటర్ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులపై పూలవర్షం కురిపించారు. సజ్జనార్ వరంగల్ జిల్లాలో సీపీగా చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై స్థానికుల నుంచి హర్షం వ్యక్తమయింది. మళ్లీ దిశా సంఘటనలోనూ నిందితుల ఎన్ కౌంటర్ జరగడంపై తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరు హర్షం వెలిబుచ్చుతున్నారు. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయరని మరోమారు నిరూపించారని ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సంఘటన ద్వారా దిశాకు న్యాయం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *