page contents

Sadly, the chances of Anu emmuel being changed

పాపం.. అనూ.. అవకాశాలు చేజారుతున్నాయి!

ఒక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్న బ్యూటీ అను ఇమ్మాయిల్‌. న‌ట‌న అంతంత మాత్రంగానే ఉన్నా త‌న గ్లామ‌ర్‌తో ఫిదాచేసి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఒక‌ప్పుడు కాల్షీట్లు ఖాళీ లేనంత‌గా బీజీగా గ‌డిపిన అను ఇమ్మాయిల్ ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ హీరోయిన్ కి అవ‌కాశాలిచ్చేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

kirthi suresh pavan kalyan anu emmuel

అను ఇమ్మాయిల్ కేరీర్ ప్రారంభంలో సాధార‌ణ సినిమాల‌ను చేసినా ఆ త‌ర్వాత అల్లు అర్జున్, ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి మెగా హీరోల‌తో చాన్స్ కొట్టేసి మెగా హీరోయిన్ అనే ట్యాగ్ త‌గిలించుకుంది. అప్పుడంతా అను ఇమ్మాయిల్ చాలా ల‌క్కీ అంటూ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమె కాల్షీట్ల కోసం ప‌డిగాపులు ప‌డేవారు. ప్రస్తుతం అను ఇమ్మాయిల్ కి సినిమా అవ‌కాశాలు లేకుండా పోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో అను ఇమ్మాయిల్ న‌టించిన అజ్ఞాత వాసి, అల్లు అర్జున్‌తో న‌టించిన నాపేరు సూర్య మూవీలు డిజాస్ట‌ర్‌గా మిగిలిపోవ‌డంతో అను ఇమ్మాయిల్ కేరీర్ గాడి త‌ప్పింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయింది.  ఒకప్పుడు త‌మ సినిమాల్లో న‌టిస్తే చాలని ఆమె చుట్టూ తిరిగిన ద‌ర్శ‌కులు ఇప్పుడు అమ్మ‌డు ఐర‌న్ లెగ్ అంటూ ముద్ర వేస్తూ మొఖం చాటేస్తున్నారు.

anu emmeuel hot

అజ్ఞాత వాసి సినిమా టైములో ద‌ర్శ‌కుడు తివిక్ర‌మ్- అనుఇమ్మాయిల్‌కు త‌న నెక్ట్ మూవీలో అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తివ్రిక్ర‌మ్ త‌న మూవీలో అను ఇమ్మాయిల్‌ను మొద‌ట తీసుకోవాల‌ని భావించినా త‌న‌కు ప్ర‌స్తుతం మార్కెట్ లేనందునా త‌న మూవీలో అను ఇమ్మాయిల్‌ను కాద‌ని పూజా హేగ్డేకు మొగ్గు చూపుతున్నార‌ని తెల్సింది. ఒక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్న అను ఇమ్మాయిల్ ఇప్పుడు అవ‌కాశాలు లేక ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిస్థితుల్లో ఏ హీరో సాహ‌సం చేసి అనుకు అవ‌కాశం ఇస్తాడో చూడాల్సిందే. పాపం .. అను ఇమ్మాయిల్‌కి స‌రైన హిట్టు ప‌డ‌క‌పోతే ఈ గ్లామ‌ర్ క్వీన్ కేరీర్ ముగిసిన‌ట్టేన‌ని ఇండ‌స్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *