page contents

Saira, who unearths history

చరిత్రను తవ్వితీస్తున్న సైరా

చరిత్రలో కనుమరుగైన ఓ వీరుడి చరిత్రకు సాక్ష్యంగా నిలువబోతుంది సైరా నర్సింహారెడ్డి మూవీ.  ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను ఈ నాటి తరానికి కళ్లకట్టినట్టు చూపించేందుకు సైరా చిత్రబృందం ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెల్సిందే.  ఆగస్టు 20న సైరా సినిమాకు సంబంధించి తొలి టీజర్ చిత్ర బృందం ముంబైలో విడుదల చేసింది.

టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు సైరా టీజర్ కన్నులపండుగను పంచింది. సైరా టీజర్ మెగా అంచనాలకు మించి ఉండటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఓ యోధుడి పాత్రలో తొలిసారి కనిపిస్తుండటంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తెలుగులో సైరా టీజర్ పవన్ కల్యాన్ వాయిస్ తో మొదలవ్వడం మెగా అభిమానులకు మెగా హీరోలంతా ఒకటే అన్న సందేశాన్నిచ్చింది. అన్నయ్య కోసం తమ్ముడు పవన్ సైరాకు తన మద్దతు పలకడంపై అభిమానుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుతుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి పలువురు స్టార్లు నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

సైరా టీజర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి చెప్పిన డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది. పలువురు ప్రముఖులు సినిమా నిర్మాత రాంచరణ్, హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఇండియా సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు ఈ సినిమా టీజర్ కు టిక్కెట్ పెడితే ఈజీగా వంద కోట్లు రాబట్టేదని చర్చించుకుంటున్నారు. అంతలా ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని అభిమానులు చెబుతున్నారు. కాగా టీజర్ తోనే హీట్ పుట్టించిన సైరా.. ఇక రిలీజ్ అయితే ఇంకేన్నీ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. సైరా టీం అందుకు తగ్గట్టుగానే సైరా మూవీని ప్రమోట్ చేస్తోంది. కాగా ఈ సినిమాను అక్టోబర్ 2న(గాంధీ జయంతి)న విడుదల చేసేందుకు సైరా చిత్రబృందం అన్ని ఏర్పాట్లను చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *