page contents

SIIMA celebrations Starts from August 15th

15నుంచి సైమా సందడి షురూ..

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలకు ముస్తాబైయింది. ప్రతియేటా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో సైమా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 2019కి సంబంధించిన వేడుకలను ఆగస్టు 15, 16 తేదిల్లో ఖాతర్లోని దోహాలో నిర్వహించేందుకు సైమా వేదికను సిద్ధం చేసింది.

ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్..

SIMA AWARDS GUEST HOUNORS

రెండురోజులపాటు సైమా వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. 15న తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఈ వేడుకను మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే 16 తేదిన తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు, పద్మభూషణ్ మోహన్ లాల్ ముఖ్య అతిథి హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్టుల్లో ప్రతిభ కనబరిచిన టాలీవుడ్, కోలివుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లకు చెందినవారికి అవార్డులను అందజేయనున్నారు. అలాగే సినీ రంగానికి విశేష సేవలు చేసిన వారిని సత్కరించనున్నారు.

సైమా నామినేషన్లు..

SIMA TELUGU BEST ACTOR NOMINATIONS

ఉత్తమ నటుడు కేటగిరి: దుల్కర్ సల్మాన్(మహానటి), మహేశ్ బాబు(భరత్ అనే నేను), ఎన్టీఆర్ (అరవింద సమేత వీర రాఘవ), రాంచరణ్(రంగస్థలం), సుధీర్ బాబు(సమ్మోహనం), విజయ్ దేవరకొండ(గీతగోవిందం)

ఉత్తమ చిత్రం: భరత్ అనే నేను, గీత గోవిందం, అరవింద సమేత వీర రాఘవ, రంగస్థలం, మహానటి.

ఉత్తమ దర్శకుడు: ఇంద్రగంటి మోహన కృష్ణ(సమ్మోహనం), నాగ్ అశ్విన్(మహానటి), పరుశురామ్(గీత గోవిందం), సుకుమార్(రంగస్థలం), త్రివిక్రమ్(అరవింద సమేత వీర రాఘవ).

siima 2019-best actress nominations telugu

ఉత్తమ నటి: అదితి రావ్ హైదరీ(సమ్మోహనం), అనుష్క(భాగమతి), కీర్తి సురేష్(మహానటి), రష్మిక మందాన(గీత గోవిందం), సమంత(రంగస్థలం).

ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు(రంగస్థలం), జయరామ్(భాగమతి), కునాల్ కపూర్(దేవదాస్), మాధవన్(సవ్యసాచి), శరత్ కుమార్(నా పేరు సూర్య)

ఉత్తమ సహాయనటుడు: ఆది పినిశెట్టి(రంగస్థలం), మురళీశర్మ(విజేత), రాజేంద్రప్రసాద్(మహానటి), నరేష్(సమ్మోహనం), రాంకీ(ఆర్ఎక్స్100).

ఉత్తమ సహాయనటి: అనసూయ(రంగస్థలం), ఆశా శరత్(భాగమతి), జయసుధ(శ్రీనివాస కల్యాణం), రమ్యకృష్ణ(శైలజారెడ్డి అల్లుడు), సుప్రియ(గూఢచారి).

ఉత్తమ సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్(ఆర్ఎక్స్ 100), దేవీశ్రీ ప్రాద్(రంగస్థలం), గోపీ సుందర్(గీత గోవిందం), మిక్కీ జే మేయర్(మహానటి), ఎస్ఎస్.తమన్(అరవింద సమేత వీర రాఘవ).

ఉత్తమ హాస్యనటుడు: సత్య(ఛలో), పృథీ(శైలజారెడ్డి అల్లుడు), సునీల్(అమర్ అక్బర్ ఆంటోనీ), వెన్నెల కిషోర్( చి.ల.సౌ), విష్ణు(టాక్సీవాలా).

ఉత్తమ గీత రచయిత: అనంత్ శ్రీరామ్(ఇంకే.. ఇంకే కావాలే-గీత గోవిందం), చంద్రబోస్(ఎంత సక్కగున్నావే-రంగస్థలం), కృష్ణకాంత్(మాటే వినదుగా-టాక్సీవాలా), రామజోగయ్య శాస్త్రి(పెనివిటి-అరవింద సమేత వీర రాఘవ), సిరివెన్నెల సీతారామశాస్త్రి(మూగ మనసులు-మహానటి).

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(పిల్లారా.. ఆర్ఎక్స్ 100), కాలభైరవ(పెనివిటి-అరవింద సమేత వీర రాఘవ), కైలాష్ ఖేర్(వచ్చాడయ్యే.. స్వామీ-భరత్ అనే నేను), రాహుల్ శిపిలిగంజ్(రంగా.. రంగా..-రంగస్థలం), సిద్ శ్రీరామ్(ఇంకే.. ఇంకేం.. కావాలే..-గీత గోవిందం).

ఉత్తమ గాయని: చిన్మయి(ఏంటీ.. ఏంటీ..-గీత గోవిందం), మానసి(రంగమ్మ మంగమ్మ-రంగస్థలం), శ్రేయా ఘోషల్(అల్లసాని వారి-తొలిప్రేమ), శ్రేయా గోపరాజు(టిక్ టిక్ టిక్-సవ్యసాచి), సునీత(చివరకు మిగిలేది-మహానటి).

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: డానీ సెలజ్ పేజ్(మహానటి), జార్స్ సి విలియమ్స్(తొలిప్రేమ), జేకే (పడిపడి లేచె మనసు), రత్నవేలు(రంగస్థలం), షానియల్ దేవ్(గూఢచారి).

రంగస్థలం అత్యధికంగా 12 కేటగిరిల్లో నామినేషన్ కాగా మహానటి 9, గీత గోవిందం 8, అరవింద సమేత వీర రాఘవ 6, సంమ్మోహనం 4, ఆర్ఎక్స్ 100, భాగమతి, భరత్ అనే నేను 3 కేటగీరిల్లో నామినేషన్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *