page contents

sonia gandhi re elected as leader of cpp

పార్టీని చక్కదిద్దే పనిలో సోనియా..

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరా పరాజయం పాలైంది. ఈ ఫలితాలతో బేజరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన పదవీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం, ఇతర ముఖ్యనేతలు ఎంత వారించినా రాహుల్ గాంధీ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దే పనిని స్వయంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాాగాంధీ తన భుజన వేసుకున్నారు.

soina gandhi re elected as cpp leader

ఈమేరకు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం(సీపీపీ) జరిగింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైన వారే పార్లమెంట్లో పార్టీ నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  ప్రస్తుతం కాంగ్రెస్ నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్టా మళ్లీ తెరపైకి సోనియా పేరు వచ్చింది.  ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ గా సోనియా గాంధీ(72) ఎంపికై అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. రాహుల్ గాంధీని సీపీపీ చీఫ్ గా ఎన్నుకుంటారనే ప్రచారం జరిగినా రాహుల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెగేసి చెప్పడంతో అధిష్టానం ప్రత్యామయ చర్యలను చేపట్టింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ గా సోనియాగాంధీని ప్రతిపాదించగా పార్టీ నాయకులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు.

sonia gandhi monmohan singh

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లను మాత్రమే గెలుచుకొంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా మూడు సీట్లు కావాల్సి ఉంటుంది. కాగా గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా వ్యవహరించిన మల్లికార్జున్ ఖర్గే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. ఇక రాహుల్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తానని భీష్మించుకొని కూర్చోవడంతో ప్రస్తుత పరిస్థితిని సోనియాగాంధీ చక్కదిద్దుతున్నారు. ఇకనైనా రాహుల్ గాంధీ బీజేపీ ఉచ్చులో చిక్కుకోకుండా సోనియాగాంధీ అడుగుజాడల్లో నడువాలని, సోనియా వారసత్వాన్ని అందుకొని పార్టీని ముందుండి నడించాలని కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నాయి. ఇప్పటికైనా రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రాహుల్ త్వరగా ఓటమిని నుంచి బయటపడి 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అయితే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ఆ దిశగా రాహుల్ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *