page contents

Syeraa Pre-Release Event at Hyderabad

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే..

మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న మెగా ఈవెంట్ కి వేదిక ఖరారైంది. అందరు అనుకున్నట్టుగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలుకు బదులుగా హైదరబాద్ వేదికగా మారింది. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ టాలీవుడ్లోనే చేస్తున్నారనగానే ముందుగా వినిపించిన పేరు కర్నూలు జిల్లానే. అయితే మెగా ఈవెంట్ కి వివిధ ప్రాంతాల నుంచి సీని అతిరథ మహారథులు విచ్చేస్తున్నందున చిత్రబృందం అన్నింటిని దృష్టిలో ఉంచుకొని వేదికను హైదరాబాద్ కి మార్చినట్టు తెలుస్తోంది.

ఈనెల 18న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ప్రముఖ దర్శకులు కొరటాల శివ, వీవీ వినాయక్ హాజరు కానున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సైరా ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కే.తారాక రామారావు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారని చిత్రబృందం తెలిపింది.

syerra trailer

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రాంచరణ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2న సైరాను విడుదలవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార, తమన్నా, జగతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెల్సిందే. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి సైరా విడుదలవుతోంది. ఇప్పటికే సైరా టీజర్ ను ముంబైలో విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇక హైదరాబాద్లో నిర్వహించే సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైరా మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.  ట్రైలర్ కోసం మెగా అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులన్నీ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. సుమారు 40కోట్ల రూపాయాలకు డిజిటల్ హక్కులన్నీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. విడుదలకు ముందే టాలీవుడ్ రికార్డున్ని తిరగరాస్తున్న సైరా.. విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులన్నీ బద్దలుకొట్టనుందో మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

chiru, pavan kalyan with mega fans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *