page contents

Telangana Cabinet Expansion

తెలంగాణ క్యాబినేట్ విస్తరణ షూరూ..

తెలంగాణ క్యాబినేట్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్కే జోషికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కు కేసీఆర్ ముందస్తు సమాచారం అందించారు. కేసీఆర్ ఏ పని చేసినా నెంబర్, ముహుర్తం వంటి వాటిని చూసి పనులు ప్రారంభిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం దశమి మంచి ముహుర్తం కావడంతో సాయంత్రం 4గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

telangana cm kcr

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ తొలి మహిళా గవర్నర్

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గవర్నర్ గా ఇఎస్ఎల్ నర్సింహాన్ కొనసాగుతూనే వచ్చారు. ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో తెలంగాణ కొత్త గవర్నర్ గా కేంద్రం తమిళి సై సౌందర్ రాజన్ ను నియమించింది. ఈమేరకు సౌందర్ రాజన్ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా ఖ్యాతి గడించనున్నారు. అంతేకాకుండా తెలంగాణ రెండో గవర్నర్ గా సుందర్ రాజన్ పేరు నిలుస్తుంది. ఈమేరకు ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ తమిళి సై చేత ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Tamilisai Soundararajan

గవర్నర్ ప్రమాణ స్వీకారం రోజే.. కేసీఆర్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

తెలంగాణ రెండో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ భాగంగా కేసీఆర్ తన క్యాబినెట్లోకి కొందరికి అవకాశం కల్పించడంలో భాగంగా క్యాబినెట్లోకి కొంతమందిని తీసుకోనున్నారు. కొత్త మంత్రులచే నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సౌందర్ రాజన్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా లోక్ సభ ఎన్నికల అనంతరం క్యాబినెట్ విస్తరణ ఉంటుందని పలుమార్లు వార్తలు వచ్చాయి. అయినా కేసీఆర్ క్యాబినేట్ విస్తరించలేదు. క్యాబినెట్ విస్తరణ అనేగానే కొందరి పేర్లు, పైరవీలు తెరపైకి వచ్చేవి. కాగా కేసీఆర్ వీటన్నింటికి చెక్ పెడుతూ ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం రోజే తన క్యాబినెట్ విస్తరణ చేపట్టడం విశేషం. ఊహించని విధంగా ప్రత్యర్థిని చిత్తు చేస్తూ ముందుకెళ్లే కేసీఆర్.. క్యాబినెట్ విస్తరణలోనూ తన  రాజకీయ చతురతనో మరోసారి ప్రదర్శించి ప్రత్యర్థులతోపాటు టీఆర్ఎస్ నేతలకు కొంత ఝలక్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *