page contents

Tiktok is the only Entertainment and educational tool in India

భారత్ లో వినోదంతోపాటు విద్యనందించే

ఏకైక సాధనం టిక్ టాక్

ప్రస్తుతం భారతదేశంలో వినోదంతోపాటు విద్యనందించే ఏకైక మాధ్యమం ఏదైనా ఉందంటే ఠక్కున గుర్తొచ్చే పేరు టిక్ టాక్. వినియోగాదారుల అభిరుచులకు అనుగుణంగా టిక్ టాక్ ఎప్పటికప్పుడు మార్పులను తీసుకొస్తుంది. వినియోగదారుల ఉపయోగార్థం టిక్ టాక్ యాప్ లోపల ఓ సవాల్ ను #ఎడ్యుటాక్ పేరిట ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులకు అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన కంటెంట్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి #ఎడ్యుటాక్ సహాయపడుతుంది.

విద్య, వినోదానికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడంలో యునైటెడ్ స్టేట్స్ కు చెందిన శుభోదయ షో సీసమీ స్ట్రీట్ ఎంతో ఆదరణ పొందింది. దీనిని సుప్రసిద్ధ లఘు వీడియో ఫ్లాట్ ఫామ్ అయిన టిక్ టాక్ గుర్తించి తన వినియోగదారుల సహకారంతో ఓ సవాల్ చేపట్టింది. అదే #ఎడ్యుటాక్.

tiktok

ఈ # ఎడ్యుటాక్ లో ప్రధానంగా విద్య, స్ఫూర్తి, భద్రత, ఆహార పదార్థాల తయారీ, ఆరోగ్యం, వెల్ నెస్ వంటి అంశాలున్నాయి. టిక్ టాక్ # ఎడ్యుటాక్ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 32బిలియన్ వ్యూస్ ను సంపాదించింది. కేవలం భారత్ లోనే 200మిలియన్లకు పైగా యూజర్లు తమ భావోద్వేగాలను ప్రదర్శించే మాధ్యమంగా టిక్ టాక్ నిలిచింది. వినియోగదారుల భావోద్వేగాలను పంచుకోవడమేకాకుండా ఈ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లు యోగా, ఇంగ్లీష్ లేదా ఎడ్యుటాక్ ద్వారా ఆరోగ్యంగా ఉండటం, వంటలు తయారు చేయడం వంటి అంశాలను నేర్చుకోవచ్చు.

ఈ # ఎడ్యుటాక్ సవాల్ ద్వారా భారతీయులు వివిధ అంశాలను నేర్చుకుంటారని టాక్ టాక్ భరోసా కల్పిస్తుంది. ఇప్పటికే పేరొందిన కంటెంట్ సృష్టికర్తలు టిక్ టాక్ లో తమ వీడియోలను అప్లోడ్ చేస్తూ యూజర్లకు సమాచారాన్ని అందిస్తున్నారు. టిక్ టాక్ లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఉర్మిపాండ్యా, డాక్టర్ అనిమేష్ వంటివారు ఎడ్యుకేషన్ వీడియోలను, ఆరోగ్యం, ఫిట్ నెస్ కు సంబంధించిన సూచనలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

అదేవిధంగా ఇతర కంటెంట్ సృష్టికర్తలైనటువంటి మృదుల్ మదోక్, గీత్ లు స్ఫూర్తిదాయక, విద్య, ఆరోగ్య సంబంధ అంశాలను # ఎడ్యుటాక్ లో పొందుపరుస్తున్నారు. వీరిలాగే చాలామంది సుప్రసిద్ధ కంటెంట్ సృష్టికర్తలు #ఎడ్యుటాక్ సవాల్లో పాలుపంచుకుంటూ యూజర్లకు విజ్ఞానాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, భోపాల్, అమృత్ సర్ లాంటి నగరాల నుంచి కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలను #ఎడ్యుటాక్ లో వీడియోలను అప్లోడ్ చేస్తూ సమాచారాన్ని యూజర్లకు చేరవేస్తున్నారు.

టిక్ టాక్ ప్లాట్ ఫామ్లో తప్పనిసరి వీడియోలు..

టిక్ టాక్

ఫైట్ కొలెస్టాల్: డాక్టర్ అనిమేష్, తన టిక్ టాక్ హ్యాండిల్ @ సర్జరీ ఆన్ లైన్ ద్వారా తరుచుగా తన ఫాలోవర్ల కోసం ఫిట్ గా ఉండాల్సిన అవశ్యకతను గురించి తెలియజేస్తుంటారు. ఆయన ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసుకోవడం, శాచురేటెడ్ ఆవశ్యకత, అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ప్రమాదాలు అదేవిధంగా రెగ్యులర్ గా తీసుకోవాల్సిన విటమిన్స్, వాటి అవశ్యకతపై వీడియోలను పెడుతుంటారు. ఈ వీడియోలను https://www.tiktok.com/@surgeryonline?refer=embed. వద్ద చూడవచ్చు.

మోడల్ టిప్స్: మృదుల్ మదోక్ అత్యంత ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ యూజర్. ఇతను ఫిట్ నెస్, ఆరోగ్యం వంటి అంశాలపై వీడియోలను యూజర్లతో పంచుకుంటారు. అంతేకాకుండా ఔత్సాహిక మోడల్స్ కు ఫ్రీలాన్స్ మోడల్ గా ఉండటంతో కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తుంటారు. ఈ ఔత్సాహిక మోడల్స్ కు రెగ్యులర్ డే జాబ్స్ ఉండటం గురించి తెలుపుతూనే అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు ఇస్తుంటారు. ఆయన వీడియోలను
https://www.tiktok.com/@mridulmadhok?refer=embed వద్ద చూడవచ్చు.

ఇంగ్లీష్ లెసన్స్ ఏనీఒన్: గీత్ మీకు సహాయపడుతుంటే మీరెందుకు డబ్బులు చెల్లించాలి. @ఇంగ్లీష్ విత్ గీత్, టిక్ టాక్ పై అత్యంత ప్రాచుర్యం పొందిన ఛానెల్. ఆంగ్ల భాషపై బేసిక్స్ ఇక్కడ నేర్చుకోవచ్చు. గీత్ మొదటగా పదాలను హిందీలో వివరించి వాటికి ఆంగ్ల అర్థాలను తెలుపుతుంటారు. అలాగే ఆమె సాధారణ పదాలను వాడటంలో చేసే పొరపాట్లను సైతం చెబుతుంటారు. వాటిలో టేక్ ఆఫ్ మరియు టేక్ ఆన్ వంటివి కూడా ఉంటాయి. మీరు ఈ వీడియోలను
https://www.tiktok.com/@englishwithgeet?refer=embed వద్ద చూడవచ్చు.

గెట్ ఫిట్ విత్ యోగా: ఉర్మి పాండ్యా అంతర్జాతీయ యోగా ఇన్ స్ట్రక్టర్. అహ్మదాబాద్ కు చెందిన ఆమె తన అత్యంత ప్రాచుర్యం పొందిన @యోగా ఉర్మి ఛానెల్ ద్వారా యోగాసనాలను ఎలా చేయాలో చెబుతుంటారు. ఆమె వీడియోలు స్ఫూరిదాయకంగా ఉంటాయి. ఈ వీడియోలను
https://www.tiktok.com/ @yogaurmi.india?refer=embed వద్ద చూడవచ్చును.

ఏదిఏమైనా టిక్ టాక్ నానాటికీ వినోదంతోపాటు విద్య విషయాలను తెలియజేస్తూ భారత్ లో యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరిని టిక్ టాక్ ఆకట్టుకుంటుంది. టిక్ టాక్ కేవలం వినోదానికి కాకుండా విజ్ఞాన విషయాలను తెలియజేస్తుండటంతో అధిక సంఖ్యలో వీక్షకులు టిక్ టాక్ ను ఫాలో అవుతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *