page contents

Tragedy at home in anchor suma kanakala

యాంకర్ సుమకనకాల ఇంటా విషాదం

ప్రముఖ యాంకర్ సుమ ఇంటా విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్(74) అనారోగ్యం శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేవాదాస్ కుమారుడు నటుడు రాజీవ్ కనకాల చిత్రసీమలో మంచి నటుడిగా గుర్తింపు సాధించగా ఆయన కోడలు సుమ కనకాల స్టార్ యాంకర్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే.

1945, జూలై 30న దేవదాస్ యానంలోని కనకాలపేటలో జన్మించారు. దేవదాస్ తండ్రి పాపయ్య నాయుడు ప్రెంచి పరిపాలన యానాంలో ఉన్నప్పుడు ఎమ్మల్యేగా పనిచేశారు. దేవదాసు తల్లి మహాలక్ష్మమ్మ. దేవదాస్ పుణె ఫిల్మ్ ఇనిస్టూట్యూట్ లో విద్యనభ్యసించి తదనంతర కాలలో నటనా శిక్షణ సంస్థను ప్రారంభించారు.

దేవదేస్ కొన్ని సినిమాల్లో, టీవీ సిరియల్సో నటించారు. సిరిసిరి మువ్వ, మంచుపల్లకి, గోరింటాకు, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో నటించారు. చివరగా ఆయన నటించిన మూవీ భరత్ అనే నేను. ప్రముఖ నటులు రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేక సుధాకర్, భానుచందర్, నాజర్, రఘువరన్ తదితరులు దేవదాస్ వద్ద శిక్షణ పొందారు. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల, కోడల సుమ కూడా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు.

Suma-Rajeev-Kanakala-with-their-familiess(file)

2018లో దేవదాస్ సతీమణి లక్ష్మి మృతిచెందింది. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడించారు. ఆయన మృతిపట్ల సీని పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *