page contents

Valmiki Movie Poster Release

పవర్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాల్మీకి

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వాల్మీకి టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. సెప్టెంబర్ 2న(నేడు) పవన్ స్టార్ 48వ బర్త్ డేను పురస్కరించుకొని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి సినిమా పోస్టర్ పై ‘హ్యపీ బర్త్ డే పవర్ స్టార్’ అంటూ విడుదల చేసింది.

ఈ సినిమా పోస్టర్ ను వరుణ్ తేజ్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేసి మెగా అభిమానులతో పంచుకున్నాడు. తన ట్వీటర్ అకౌంట్లో ‘పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు.. ఏది ఏమైనా మీతోనే ఉంటాం’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మరో పోస్టర్ ను విడుదల చేసింది.

ఇక వాల్మీకి విషయానికొస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా పుజాహెగ్దే నటిస్తుంది. వరుణ్ తేజ్ తో పుజాహేగ్దే నటించడం ఇది రెండోసారి. ఇదివరకే ముకుందా మూవీ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వాల్మీకి సినిమాకు గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్మకత్వం వహిస్తుండగా మిక్కిజే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *