page contents

Who has berth finalized in the KCR cabinet?

కేసీఆర్ క్యాబినెట్లో బెర్త్ ఖరారు చేసుకుంది వీరేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈమేరకు కేసీఆర్ క్యాబినెట్లో చోటు ఎవరెవరికీ దక్కనుందనే ఆసక్తి నెలకొంది. పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ ఇప్పటికే మంత్రి వర్గంలో ఆరుగురికి చోటు కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురి పేర్లను గవర్నర్ కు సమాచారం అందించారు.

కేసీఆర్ మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురు..

KCR CABINET

క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రతీసారి ముందుగా వినబడే పేరు హరీష్ రావుదే. అందుకు తగ్గట్టుగానే ఈసారి ఆయన మంత్రివర్గంలో కేసీఆర్ స్థానం కల్పించనున్నారు. అలాగే హరీష్ రావుతోపాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్, గంగుల కమాలకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. కేసీఆర్ క్యాబినెట్లో ఇప్పటివరకు మహిళలకు చోటు కల్పించలేదు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. కేసీఆర్ మొదటి క్యాబినెట్లోనే మహిళా మంత్రులకు స్థానం కల్పిస్తారని ఆశించిన అది జరుగలేదు. ఇక రెండోసారి క్యాబినెట్ విస్తరించడంతో ఈసారి ఇద్దరు మహిళలకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ క్యాబినెట్లో చోటు దాదాపు ఖరారైనట్లు సమాచారం. వీరందరిచే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *