Will the heroines have a second chance with Chiranjeevi?

By | August 1, 2019

చిరంజీవితో ఆ హీరోయిన్లకు రెండో చాన్స్ దక్కేనా?

కోరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రానున్న సంగతి తెల్సింది. ఈ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు.. అప్పుడే చిరుతో రోమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. చిరంజీవితో ఇప్పటికే సైరా నర్సింహారెడ్డి మూవీలో నయనతార, ఖైదీ-150 మూవీలో కాజల్ అగర్వాల్ నటించారు. అయితే చిరంజీవి 152 మూవీలో రెండో చాన్స్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు దక్కేనా అనే చర్చ నడుస్తోంది.

chiru with nayanatara

చిరంజీవి-కోరటాల కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజీ, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు సామాజిక అంశాలతో కూడిన హిట్ మూవీలుగా నిలిచారు. చిరంజీవి సినిమాల్లోనూ సామాజిక అంశాలతో కూడిన ఏదోఒక మేనేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు. చిరంజీవి చాలా సినిమాల్లో ద్విపాత్ర అభినయం చేశారు. రీసేంట్ గా వచ్చిన ఖైదీ 150లోనూ చిరంజీవి రెండు పాత్రలో కనిపించి మెప్పించాడు.

చిరంజీవి ఒక పాత్రలో యువకుడిగా, మరోక పాత్రలో మధ్య వయస్సు కలిగిన నక్సల్స్ తో పెరిగిన పాత్ర కనిపించనున్నాడని సమాచారం. అయితే ఇందులో చిరంజీవితో రోమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలో ముందువరుసలో నయనతార, కాజల్ పేర్లు విన్పిస్తున్నాయి. అలాగే అనుష్క, కీర్తి సురేష్, శ్రద్ధా శ్రీనాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు కొరటాల శివ చిరుపక్కన కొత్త హీరోయిన్లను తీసుకునేందుకు యత్నిస్తున్నాడని అందుకే హీరోయిన్ల విషయంలో రోజుకో పేరు విన్పిస్తున్నట్లు సమాచారం. సైరాలో నయనతార ఫార్మమెన్స్ చూసిన చిరంజీవి తన 152లో మూవీలో నయనతారను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాంచరణ్ స్నేహితురాలైన కాజల్ ను నిర్మాత అయిన రాంచరణ్ తన చిత్రంలో తీసుకోవాలని యత్నిస్తున్నాడు.

chiru kajal

ఈ చిత్రానికి రాంచరణ్-నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మించబోతున్నాడు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా చిరంజీవితో ఇప్పటికే కలిసిన నటించిన కాజల్ అగర్వాల్, నయనతారకు రెండో చాన్స్ దక్కేనా అనేది సందేహంగా కన్పిస్తుంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున నాటికి ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రావడం ఖాయం. అంతవరకు వేచి చూడాల్సిందే మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *