page contents

Woman to deliver a baby at 74

అమ్మ(బామ్మ) నీకూ వందనం..

అమ్మ అనే మాతృత్వపు  పిలుపు కోసం మహిళలు ఎంతగా తపిస్తారనేది ఓ బామ్మ కళ్లకు కట్టినట్టు చూపించింది. అమ్మ అని పిలిపించుకోవాలని పెళ్లాయిన నాటి నుంచి ఎదురుచూస్తున్న ఆ మహిళ కల 74ఏళ్ల వయస్సులో నెరవేరబోతుంది. పెళ్లయిన 57ఏళ్లకు తన నిరీక్షణకు తెరపడనుంది. గురువారం ఆ బామ్మ పండంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Doctors made arrangement to perform delivery to her

అసలు విషయానికొస్తే.. తూర్పు గోదావరి జిల్లా వర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహామైంది. పెళ్లాయిన నాటి నుంచి మంగాయమ్మ దంపతులు పిల్లల కోసం తపిస్తూ పలు ఆస్పత్రుల చుట్టూ తిరగారు. అయినా వారి కల నెరవేరలేదు. ఏళ్లు గడుస్తుండటంతో ఆ దంపతులు వృద్ధాప్యంలోకి జారుకున్నారు. అయినా ఆ బామ్మలో ఎక్కడో చిన్న ఆశ ఉండేది. తాను ఎప్పటికైనా తల్లిని అయితానని.. వైద్యరంగంలో వచ్చిన సాంకేతిక పద్ధతులు ఆమె పాలిట వరంలా మారాయి అని చెప్పొచ్చు.

ఈక్రమంలోనే మంగాయమ్మ పొరుగున ఉండే ఓ మహిళ 55ఏళ్ల వయస్సులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయింది. ఇంకేముందే తన కల నెరవేర్చుకోవడానికి ఈ బామ్మ కూడా పిల్లల కోసం ఐవీఎస్ పద్ధతిని ఆశ్రయించింది. ఈ విధానంలో భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎస్) పద్ధతిలో అండంలో ప్రవేశపెడుతారు. కాగా మొదటి ప్రయత్నంలోనే వైద్యుల పరీక్షల్లో మంగాయమ్మ గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చారు. గురువారం ఉదయం ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయనున్నారు. ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా 74ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న మంగాయమ్మ ప్రపంచ రికార్డును సృష్టించబోతుంది. ఇప్పటివరకు 70ఏళ్ల వయస్సులో దల్జీందర్ సింగ్ కౌర్ అనే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పేరిట ఉన్న రికార్డును 74ఏళ్ల మంగాయమ్మ తన పేరిట నెలకొల్పనుంది. ఏదిఏమైనా 57ఏళ్ల తన నిరీక్షణకు ఇద్దరు ఆడపిల్లలు(కవలల రూపంలో) నెరవేరింది. వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా మంగాయమ్మ చేస్తున్న ప్రయత్నం మాతృత్వం కోసం మహిళలు ఎంతగా తపిస్తారనేదనికి ఓ మచ్చుతునకగా చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *