page contents

ys jagan stong warning to yellow media

నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి  గురువారం  ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  ఈ వేడుకకు అంగరంగ వైభవంగా ముస్తాబు అయింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తన మొదటి ప్రసంగంలోనే కొన్ని మీడియా సంస్థలకు స్ట్రాంగ్ వార్మింగ్ పంపడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.

ఆ మీడియా సంస్థలకు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబే..

‘‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ.. మనం ఈనాడును చూసినా.. ఆంధ్రజ్యోతిని చూసినా.. టీవీ-5ని చూసినా.. మన కర్మ.. అవే చూస్తాం.. వాళ్ల కళ్లకు  ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రిగా ఇంపుగా కనిపిస్తాడు.. ఎవరేవరూ ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఇంపుగా కనిపించదు వారిని ఎలాగైన గద్దె దించే కుట్రలు చేస్తారని’’ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన జోలికి వస్తే మాత్రం ఆ మీడియా సంస్థలకు కాలం చెల్లినట్టే అన్నట్టూ ఈ సభా వేదిక నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు. తాను రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టేందుకు పూనుకున్నానని అందులో భాగంగా అవినీతి జరిగిన కాంట్రాక్టర్లను రద్దు చేయనున్నట్లు తెలిపారు. పారదర్శకంగా జ్యుడిషియల్ కమిటీని వేసి హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో నూతన కాంట్రాక్టర్లకు టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు.

అయితే  దీనిపై ఆ మీడియా సంస్థలు తప్పడు ఉద్దేశ్యాలను అంటగడుతూ వార్తలు రాస్తాయని చెప్పారు. తమపై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని ఆ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. అంతేకాకుండా హైక్టోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లి వారిని శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తన మొదటి ప్రసంగంలో స్ట్రాంగ్ వార్మింగ్ పంపడం గమనార్హం. తాను మంచి పాలన అందించేందుకు ఆరు నుంచి సంవత్సర కాలం సమయం పడుతుందని, అంతటైము తనకు ఇవ్వాలని అలా కాకుండా తప్పుడు వార్తలతో తనను బాద్నం చేస్తే ఆ మీడియా సంస్థలకు మూడినట్టే అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కనిపించింది. జగన్ వాలకం చూస్తుంటే ఆ మీడియా సంస్థలకు ముందుంది.. ముసళ్ల పండుగ అన్న సామెత గుర్తుకురాక తప్పదేమో.. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ మీడియా సంస్థలు ఏవిధంగా వ్యవహరిస్తాయనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *